తెలంగాణ

telangana

ETV Bharat / bharat

విద్యార్థిని ఆత్మహత్య.. యువకుల వేధింపులే కారణమా? - kannauj news today

ఉత్తర్​ప్రదేశ్​లో దారుణం జరిగింది. యువకుల వేధింపుల తట్టుకోలేక ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది ఓ విద్యార్థిని. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు నలుగురు యువకులపై కేసు నమోదు చేశారు.

molestation in kannauj
విద్యార్థిని ఆత్మహత్య

By

Published : Jun 22, 2022, 3:13 PM IST

యువకుల వేధింపులు తట్టుకోలేక విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​, కన్నౌజ్​లో ఛిబ్రామౌ కొత్వాలిలో జరిగింది. స్థానికంగా ఉన్న నలుగురు యువకుల వేధింపుల వల్లే తన కుమార్తె ఉరి వేసుకుందని బాధితురాలి తండ్రి తహ్రీర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మృతురాలు బీఎస్సీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది.

అసలేం జరిగిందంటే: స్థానికంగా నివసిస్తున్న నలుగురు యువకులు.. బాధితురాలిని చాలా కాలంగా వేధిస్తున్నారు. మంగళవారం కూడా విద్యార్థినిపై వేధింపులకు పాల్పడ్డారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు సుమిత్, శివం, అన్షుల్, చోటూలపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ప్రతిరోజూ తన కుమార్తెను వేధించేవారని బాలిక తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ నలుగురే యువతి ఆత్మహత్యకు పాల్పడడానికి కారణమా? లేదా ఇంకేమైనా కారణాలున్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details