తెలంగాణ

telangana

By

Published : Jan 1, 2023, 9:31 PM IST

ETV Bharat / bharat

దిల్లీలో దారుణం.. యువతిని కారుతో 4 కి.మీ ఈడ్చుకెళ్లి.. నగ్నంగా వదిలేసి!

మద్యం మత్తులో కొందరు యువకులు.. కారుతో స్కూటీపై వెళ్తున్న ఓ యువతిని ఢీకొట్టారు. అనంతరం ఆమెను నాలుగు కిలోమీటర్లు రోడ్డుపై ఈడ్చుకెళ్లారు. దీంతో తీవ్రగాయాలతో ఆమె మృతిచెందింది. ఈ దారుణ ఘటన దిల్లీలో జరిగింది.

girl killed in car accident in delhi body dragged
స్కూటిపై వెళుతున్న బాలికను డీకొట్టిన కారు

దేశ రాజధాని దిల్లీలో షాకింగ్‌ ఘటన వెలుగు చూసింది. కొత్త ఏడాది తొలిరోజే ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. న్యూఇయర్‌ సెలబ్రేషన్స్‌లో తప్పతాగిన ఐదుగురు దుండగులు బాధితురాలి స్కూటర్‌ను ఢీకొట్టారు. అనంతరం ఆమెను నాలుగు కిలోమీటర్లు రోడ్డుపై ఈడ్చుకెళ్లారు. శరీరంపై నూలుపోగు కూడా లేకుండా రోడ్డుపై పడి ఉన్న ఆ యువతి మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..బాధితురాలు ఆదివారం తెల్లవారుజామున తన స్కూటర్‌పై వెళ్తోంది. ఆమె స్కూటర్‌ను ఓ కారు ఢీకొట్టింది. ఈ క్రమంలోనే ఆమె డ్రెస్‌ కారు టైరులో చిక్కుకుంది. స్కూటర్‌ను ఢీకొట్టినప్పటికీ ఆగకుండా కారును ముందుకు నడిపారు. టైరులో డ్రెస్‌ చిక్కుకోవడం వల్ల సుమారు 4 కిలోమీటర్లు ఆ బాధితురాలిని ఈడ్చుకెళ్లారు. దీంతో తీవ్రగాయాలతో ఆ యువతి మృతి చెందింది. ఒంటిపై నూలుపోగు కూడా లేకుండా యువతి మృతదేహం రోడ్డు మీద కనిపించటం కలకలం సృష్టించింది.

రోడ్డుపై నగ్నంగా పడి ఉన్న యువతి మృతదేహాన్ని చూసి ముందుగా అంతా హత్యాచారంగా భావించారు. కానీ రోడ్డు ప్రమాదం కారణంగా ఆమెను కారు ఈడ్చుకెళ్లడం ద్వారా మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఆదివారం తెల్లవారుజామున 3.24 గంటలకు రోడ్డుపై మృతదేహం ఉన్నట్లు తమకు సమచారం అందిందని ఓ సీనియర్‌ పోలీసు అధికారి తెలిపారు. ఫోన్‌ రాగానే పోలీసుల బృందం హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుంది. రోహిణి జిల్లా క్రైమ్‌ టీమ్​ సైతం అక్కడికి చేరుకుని దర్యాప్తు చేపట్టింది. ఆ తర్వాత మృతదేహాన్ని ఎస్‌జీఎం ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఆ తర్వాత కారును పట్టుకుని ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.

మహిళా కమిషన్‌ నోటీసులు
యువతిని ఈడ్చుకెళ్లి మృతి చెందేందుకు కారణమైన ఘటనపై దిల్లీ మహిళా కమిషన్‌ ఆందోళన వ్యక్తం చేసింది. కేసులో నిజానిజాలు తేల్చి పూర్తి వివరాలు సమర్పించాలని పోలీసులకు నోటీసులు ఇచ్చారు మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ స్వాతి మాలివాల్‌.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details