తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Girl Killed For Touching Cycle Seat : సైకిల్​ సీట్​ను తాకిందని దారుణం.. ఐదేళ్ల చిన్నారిని గొంతు కోసి హత్య చేసిన యువకుడు - boy killed girl for touching cycle seat

Girl Killed For Touching Cycle Seat : తన సైకిల్​ సీట్​ను తాకిందని ఓ చిన్నారిని అతి కిరాతకంగా చంపాడు ఓ యువకుడు. ఉత్తర్​ప్రదేశ్​లో జరిగిన ఈ ఘటనలో బాలిక అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిండితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Girl Killed For Touching Cycle Seat
UttarPradesh Girl Murder

By ETV Bharat Telugu Team

Published : Sep 20, 2023, 9:22 AM IST

Updated : Sep 20, 2023, 9:42 AM IST

Girl Killed For Touching Cycle Seat : ఉత్తర్​ప్రదేశ్​లో దారుణం జరిగింది. సైకిల్​పై చేయి వేసిందని ఓ చిన్నారిని అతి దారుణంగా చంపాడు ఓ యువకుడు. మంగళవారం మధ్యాహ్నం సుమారు 2 గంటలకు జరిగిన ఈ ఘటనలో బాలిక అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిండితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

అసలేం జరిగింది : మహారాజ్​గంజ్​లోని నిచ్లాల్ పోలీస్ స్టేషన్​ పరిధిలోని లేడి గ్రామానికి చెందిన దీపక్ అనే యువకుడు తన సైకిల్​ను పార్క్​ చేసి దాని మీద కూర్చొన్నాడు. అదే సమయంలో రిమ్​జిమ్​ అనే ఐదేళ్ల బాలిక అక్కడికి వచ్చింది. ఆడుతున్న సమయంలో అక్కడున్న సైకిల్​ను తాకింది. దీన్ని చూసిన దీపక్ ఆ చిన్నారిని తిట్టి పంపేశాడు. కానీ ఆ చిన్నారి మరో సారి ఆ సైకిల్​ వద్దకు వచ్చింది. దీంతో కోపోద్రిక్తుడైన యువకుడు ఓ పదునైన ఆయుధంతో చిన్నారిని గొంతు కోసి హత్య చేశాడు. విషయం తెలుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని నిందితుడుని అరెస్ట్ చేశారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు నిందితుడు దీపక్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. అతని వద్ద నుంచిచిన్నారి హత్యకు ఉపయోగించిన పదునైన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే పోలీసుల నుంచి తప్పించుకునేందుకు యత్నించిన దీపక్​.. పోలీస్​ స్టేషన్​కు తీసుకెళ్తున్న సమయంలో కదులుతున్న పోలీసు వాహనం నుంచి దూకాడు. దీంతో అతనికి తీవ్ర గాయలయ్యాయి. అప్రమత్తమైన పోలీసులు అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

సోదరి తలను నరికి రోడ్డుపై తిరుగుతూ..
Brother Killed Sister In Uttarpradesh :ఉత్తర్​ప్రదేశ్​లో సొంత సోదరి తల నరికాడు ఓ యువకుడు. అనంతరం ఆమె తల, ఆయుధంతో రోడ్డుపై తిరిగాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన జులైలో జరిగింది. సోదరి వేరే వ్యక్తితో సోదరి పారిపోయిందన్న కారణంతో.. నిందితుడు ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఒక చేతిలో సోదరి తలను.. మరో చేతిలో ఆయుధంతో నడిరోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న రియాజ్​ చూసి.. స్థానికులంతా భయాందోళనకు గురయ్యారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అతడి నుంచి యువతి తలను, ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు పథకం ప్రకారమే ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తుంది. ఇంట్లో కుటుంబ సభ్యులు ఉన్న కారణంగా.. బాధితురాలిని కావాలనే బయటకు రప్పించి.. హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

ఇంటి బయట ఆడుకుంటున్న నాలుగేళ్ల చిన్నారిపై రేప్​.. అనంతరం హత్య

వ్యాపారంలో లాభాల కోసం నరబలి.. పదేళ్ల చిన్నారిని కిరాతకంగా చంపిన బంధువులు

Last Updated : Sep 20, 2023, 9:42 AM IST

ABOUT THE AUTHOR

...view details