తెలంగాణ

telangana

ETV Bharat / bharat

శస్త్రచికిత్సతో అబ్బాయిగా మారిన యువతి.. ప్రేయసితో పెళ్లికోసం దరఖాస్తు.. చివరికి.. - lady gender change

Girl Gender Change : ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న ఇద్దరు యువతుల మధ్య స్నేహం.. ప్రేమకు దారితీసింది. పెళ్లి చేసుకునేందుకు ఇద్దరిలో ఓ యువతి లింగ మార్పిడి కూడా చేయించుకుంది. అనంతరం వారిద్దరు రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకునేందుకు సబ్ డివిజన్ మెజిస్ట్రేట్​ను సంప్రదించారు. మరి ఈ ప్రేమాయణం చివరకు ఏమైందంటే?

Girl Gender Change
ప్రియురాలి కోసం యువతి లింగమార్పిడి

By

Published : Jul 14, 2023, 11:05 AM IST

Girl Gender Change : ఇద్దరు యువతుల మధ్య స్నేహం ప్రేమగా మారింది. స్నేహితురాలిని పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశంతో ఓ యువతి పురుషుడిగా లింగ మార్పిడి చికిత్స చేయించుకుంది. అనంతరం శస్త్ర చికిత్సకు సంబంధించిన ధ్రువీకరణ పత్రంతో సబ్​ డివిజనల్ కోర్టులో రిజిస్ట్రేషన్ మ్యారేజ్​ కోసం దరఖాస్తు చేసుకున్నారు. కాగా సదరు మేజిస్ట్రేట్.. ఈ విషయంలో ప్రభుత్వ న్యాయవాదుల నుంచి అభిప్రాయాలను కోరారు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది.

ఇదీ జరిగింది..
బరేలీలో ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న ఇద్దరు యువతుల మధ్య స్నేహం ఏర్పడింది. క్రమంగా వారిద్దరి మధ్య స్నేహం.. ప్రేమగా మారింది. వీరిలో ఓ యువతిది బరేలీ కాగా.. మరో యువతిది బదాయూ. వీరిద్దరూ పెళ్లి చేసుకొని దాంపత్య జీవనం ప్రారంభించాలని అనుకున్నారు. అయితే, ఇంట్లో కుటుంబ సభ్యులు వారి ప్రేమకు నిరాకరించారు. అయినప్పటికీ యువతులిద్దరూ పెళ్లి చేసుకోవాలన్న దృఢంగా నిశ్చయించుకున్నారు. చివరకు ఓ అమ్మాయి లింగ మార్పిడి కూడా చేసుకుంది. పూర్తి చికిత్స అనంతరం వారిద్దరూ సంబంధిత సర్టిఫికెట్​తో స్థానిక సబ్​ డివిజన్​ కోర్టులో రిజిస్ట్రేషన్ వివాహానికి దరఖాస్తు చేసుకున్నారు. వీరి దరఖాస్తును స్వీకరించిన మేజిస్ట్రేట్ ప్రత్యూష్ పాండే.. ఈ విషయంలో ప్రభుత్వ అడ్వొకేట్ల నుంచి లీగల్ సలహా కోరారు.

"వీరు ప్రత్యేక వివాహ చట్టం కింద దరఖాస్తు చేసుకున్నారు. ఈ చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ వివాహం చేసుకోవాలనుకున్న వారు ఎవరైనా.. అప్లికేషన్ పెట్టుకోవచ్చు. కానీ వీరి విషయంలో లింగ మార్పిడి చేసుకున్న తర్వాత దరఖాస్తు వచ్చింది. అయితే ఇలాంటి కేసు మా ముందుకు రావడం ఇదే తొలిసారి. అందుకని ప్రభుత్వ న్యాయవాదులను సలహా కోరాను. ఇలాంటి విషయాల్లో చట్టం ఎం చెబుతుందో పరిశీలించి.. అందుకు అనుగుణంగా నడుచుకుంటాం."
- ప్రత్యూష్ పాండే, సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్, బరేలీ

గతంలోనూ లింగ మార్పిడికి సిద్ధమైన ఓ యువతి..
Sex Change for Marriage: ఉత్తర్​ప్రదేశ్​లో గతంలోనూ ఇదే తరహా ఘటన ఒకటి వెలుగుచూసింది. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు ఓ యువతి లింగ మార్పిడి చేయించుకుంటోంది. తోటి క్లాస్​మేట్​తో ప్రేమలో పడ్డ ఆమె.. లింగ మార్పిడితో అబ్బాయిలా మారేందుకు సిద్ధమైంది. ఉత్తర్​ప్రదేశ్​లోని ప్రయాగ్​రాజ్​లో ఈ ఘటన జరిగింది. ముందుగా శరీర పైభాగంలోని అవయవాలకు శస్త్రచికిత్స నిర్వహించిన వైద్యులు.. యువతి గర్భాశయాన్ని సైతం తొలగించారు. ఈ కథనాన్ని పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details