Girl Gangrape By 7 People :మహారాష్ట్రలోని నాగ్‌పుర్ జిల్లాలో ఓ బాలికపై ఏడుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు. బాధితురాలి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రధాన నిందితుడిని ధీరజ్ హివార్కర్గా పోలీసులు గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. జిల్లాకు చెందిన బాధితురాలిని ప్రధాన నిందితుడు ధీరజ్ హివార్కర్.. కొన్నినెలల క్రితం వెంబడించాడు. తనతో శారీరక సంబంధం పెట్టుకోకపోతే బాలిక తండ్రిని చంపేస్తానని బెదిరించేవాడు. అలా ఆమెను లొంగదీసుకుని పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ సమయంలో బాధితురాలికి తెలియకుండా అసభ్యకరమైన చిత్రాలు తీశాడు. వాటితో కూడా వేధించి అనేకసార్లు అత్యాచారం చేశాడు. కొద్దిరోజుల తర్వాత.. ఆ చిత్రాలను తన స్నేహితులకు పంపాడు.
ఆ ఫొటోలను వైరల్ చేస్తామని బెదిరించి వేర్వేరుగా..
Seven People Gang Rape Girl : ప్రధాన నిందితుడు స్నేహితులు కూడా ఆ ఫొటోలతో బాలికను వేధింపులకు గురిచేశారు. తమతో కూడా శారీరక సంబంధాలు పెట్టుకోకపోతే ఆ ఫొటోలను వైరల్ చేస్తామని బెదిరించి వేర్వేరుగా అత్యాచారం చేశారు. ఇటీవలే బాధితురాలిపై సామూహికంగా రేప్ చేశారు. అనంతరం బాలిక.. తన కుటుంబసభ్యులకు జరిగినదంతా చెప్పింది. దీంతో బాధితురాలి తల్లి.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఏడుగురిని అరెస్ట్ చేశారు. బాధితురాలికి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు.
13 ఏళ్ల బాలికపై 28 రోజుల పాటు..
Six People Gang Rape Girl :కొద్దిరోజుల క్రితం.. 13 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఆరుగురు వ్యక్తులు. 28 రోజుల పాటు బాధితురాలిపై దారుణానికి ఒడిగట్టారు. బాలిక ఆరోగ్య పరిస్థితి విషమించడం వల్ల ఆమె తల్లికి ఫోన్ చేసి కుమార్తెను తీసుకెళ్లాలని కోరారు. ఈ హృదయ విదారక ఘటన బిహార్ ముజఫర్‌పుర్‌లో జరిగింది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు.. నిందితులపై కేసు నమోదు చేశారు. అసలేం జరిగిందంటే తెలియాలంటే ఈ లింక్‌పై క్లిక్ చేయండి.