తెలంగాణ

telangana

ETV Bharat / bharat

విద్యార్థినిపై కారులో గ్యాంగ్​ రేప్​.. డీఎస్​పీ అంకిత ఎంట్రీతో... - సామూహిక అత్యాచారం

Gang rape in Ranchi: పాఠశాల విద్యార్థినిని అపహరించి కారులోనే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఐదుగురు దుండగులు. ఈ దుర్ఘటన ఝార్ఖండ్​ రాజధాని నగరంలో గురువారం రాత్రి జరిగింది. మధ్యప్రదేశ్​లో జరిగిన మరో ఘటనలో మేకల కొట్టంలో ఓ మహిళ మృతదేహం నగ్నంగా పడి ఉండటం కలకలం రేపింది. ఆమె జననాంగాలను ఛిద్రం చేసి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు.

Girl gang raped in car in Ranchi
గ్యాంగ్​ రేప్​

By

Published : May 13, 2022, 11:38 AM IST

Gang rape in ranchi: పాఠశాల విద్యార్థినిని అపహరించిన ఐదుగురు దుండగులు కారులో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దుర్ఘటన ఝార్ఖండ్​ రాజధాని రాంచీలో గురువారం రాత్రి జరిగింది. నిందితులను అరెస్ట్​ చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు.

గురువారం సాయంత్రం బాలిక ఒంటరిగా నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్న క్రమంలో ఐదుగురు దుండగులు కారులో ఆమెను వెంబడించారు. కొద్ది దూరం వెళ్లాక అడ్రస్​ చెప్పాలంటూ ఆమెతో మాట కలిపారు. కారులోకి ఎక్కించుకుని అపహరించారు. రాతూ స్టేషన్​ సమీపంలోని ఓ రెస్టారెంట్​ వద్ద కారులోనే అత్యాచారానికి పాల్పడ్డారు.

రాత్రి పెట్రోలింగ్​ నిర్వహిస్తున్న డీఎస్​పీ అంకిత.. అనుమానాస్పదంగా ఉన్న కారును గమనించారు. వెంటనే అక్కడికి వెళ్లి కారును తనిఖీ చేశారు. అందులో ఐదుగురు యువకులు అసభ్యకరంగా కనిపించటం, వారి మధ్యలో బాలిక ఏడుస్తూ ఉండటాన్ని గమనించి వెంటనే ధుర్వ స్టేషన్​ ఇంఛార్జ్​ ప్రవీన్​ ఝాకు ఫోన్​ చేసి అదనపు బలగాలను పంపించాలని కోరారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసు బలగాలు ఐదుగురిని అరెస్ట్ చేశాయి. విచారణలో ఐదుగురు నిందితులు నేరాన్ని ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల్లో పలువురు వివిధ రాష్ట్రాల్లో చదువుకుంటున్నట్లు గుర్తించామన్నారు.

మేకల కొట్టంలో నగ్నంగా మహిళ మృతదేహం
మధ్యప్రదేశ్​, పరాసియా అసెంబ్లీ నియోజకవర్గంలోని బిజోరి గుమాయ్​ గ్రామంలో దారుణం జరిగింది. ఓ ఇంట్లోని మేకల కొట్టంలో మహిళ మృతదేహం నగ్నంగా ఉండి ప్రైవేట్​ భాగాలను ఛిద్రం చేసి కనిపించటం కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.

బాధితురాలు కొద్ది రోజులుగా అనారోగ్యానికి గురికాగా.. కుటుంబ సభ్యులు చికిత్స అందించారు. గత బుధవారం మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత నిద్రపోయిన ఆమె.. సాయంత్రం మేకలు ఉండే గదిలో రక్తపు మడుగులో నగ్నంగా పడి ఉండటాన్ని బంధువులు గుర్తించారు. ఘటన జరిగినప్పుడు బాధితురాలు, ఆమె భర్త మాత్రమే ఇంట్లో ఉన్నారని, భర్త మద్యం మత్తులో ఉన్నాడని చెప్పారు. పోస్టుమార్టం నివేదికలో మహిళ తల, మెడపై గాయాలై.. ఆమె జననాంగాల్లో కర్రను చొప్పించి చిత్రహింసలు పెట్టినట్లు తేలింది. బాధితురాలిని సరితా మర్స్​కోలే, ఆమె భర్త కలిరామ్​ మర్స్​కోలేగా గుర్తించామని పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి:12 ఏళ్ల బాలికపై అత్యాచారం.. డబ్బు కోసం సొంత తాతయ్యనే..

ఇంట్లోవాళ్లకు చిన్నారి షాక్​.. పిల్లి అనుకుని చిరుత పిల్లను తెచ్చి..

ABOUT THE AUTHOR

...view details