Girl Forced into sex: కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే అత్యాచారం చేశాడు. ఆపై డబ్బుల కోసం ఇతరులతో అత్యాచారాలకు ప్రోత్సహించాడు. ఆమె తల్లి సైతం వారికే మద్దతు తెలిపింది. ఫిర్యాదు చేస్తానని పోలీస్ స్టేషన్‌కు వెళ్లగా.. వారు సైతం అత్యాచారానికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేసింది బాధితురాలు. ఈ అమానుష ఘటన బిహార్ సమస్తిపుర్ సింఘియా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో జరిగింది. ఈ అఘాయిత్యాలను భరించలేకపోయిన బాధితురాలు.. సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తనపై రోజుకు 20-25 మంది అత్యాచారానికి పాల్పడ్డారంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
"మా అమ్మ ఇంట్లోనే మద్యం విక్రయిస్తోంది. ఈ క్రమంలోనే మద్యం తాగడానికి వచ్చినవారు నాపై అత్యాచారం చేసేవారు. తిరస్కరిస్తే కొట్టేవారు. ఈ విషయం మా నాన్న, మామకు చెబితే వారు సైతం అదే చేసేవారు. గ్రామ పంచాయితీ ప్రెసిడెంట్, ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్ వెళితే పోలీసులు అత్యాచారం చేశారు. మద్యం తాగి రోజుకు 20-25 మంది అత్యాచారానికి పాల్పడేవారు. నన్ను రక్షించండి లేకుంటే వారు చంపేస్తారు."
- బాధితురాలు
ఈ ఘటనకు సంబంధించి వీడియో బయటకు రావడం వల్ల అప్రమత్తమైన పోలీసులు రంగంలోకి దిగారు. బాధితురాలి స్టేట్మెంట్ తీసుకుని.. వైద్య పరీక్షలు నిర్వహించారు. తల్లిదండ్రులు సహా ముగ్గురిని అరెస్ట్ చేశారు. పోలీస్ స్టేషన్ ఏఎస్సై మనోజ్ కుమార్ పైన చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎస్పీ హృదయ్కాంత్ విచారణకు ఆదేశించారు. ఈ అఘాయిత్యానికి పాల్పడ్డ వారందరిపైనా కేసులు నమోదు చేస్తామని.. నిందితులకు శిక్ష పడేలా చేస్తామన్నారు.
భార్య, పిల్లలను చంపి తాను ఆత్మహత్య: ఛత్తీస్‌గఢ్ దుర్గ్ జిల్లాలో దారుణం జరిగింది. కుటుంబ సమస్యలతో భార్య సహా ఇద్దరు కుమారులను హత్య చేశాడు ఓ వ్యక్తి. తర్వాత నిందితుడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఉమర్కొటి గ్రామానికి చెందిన భోజ్‌రామ్ సాహూ.. అతడి భార్య, కుమారులను గొంతు నులిమి హత్యచేశాడు. అనంతరం అతడు కూడా సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని చనిపోయాడు. మృతులను భార్య లలిత(25), కుమారుడు ప్రవీణ్(4), టికేశ్గా (2) గుర్తించారు.