Ghulam Nabi Azad new party : దశాబ్దాలుగా కాంగ్రెస్‌లో ఉండి ఇటీవలే వేరుకుంపటి పెట్టిన సీనియర్ రాజకీయ నాయకుడు గులాం నబీ ఆజాద్.. తన కొత్త పార్టీ పేరు ప్రకటించారు. నూతన పార్టీకి 'డెమొక్రటిక్ ఆజాద్ పార్టీ'గా నామకరణం చేస్తున్నట్లు తెలిపారు. నీలం, తెలుపు, ఆవరంగులతో కూడిన పార్టీ జెండాను సైతం ఆవిష్కరించారు. పార్టీకి పేరు సూచించాలని ఇటీవల కోరగా.. అనేక మంది స్పందించారని ఆజాద్ తెలిపారు.
గులాం నబీ ఆజాద్ కొత్త పార్టీ ప్రకటన.. జెండా ఆవిష్కరణ.. పేరు ఏంటంటే? - ghulam nabi azad party
Ghulam Nabi Azad new party : కాంగ్రెస్ మాజీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ తన కొత్త పార్టీకి 'డెమొక్రటిక్ ఆజాద్ పార్టీ' అని పేరు ఖరారు చేశారు. నూతన జెండాను సైతం ఆవిష్కరించారు.
'ఈరోజు నుంచి డీఏపీని ప్రారంభిస్తున్నా. మహాత్మా గాంధీ ఆదర్శాలకు అనుగుణంగా మా భావజాలం ఉంటుంది. మా పార్టీకి ఏ రాజకీయ పార్టీతో పోటీ ఉండదు. జమ్ము కశ్మీర్లో శాంతిని, సాధారణ పరిస్థితులను నెలకొల్పేందుకు మేం ప్రయత్నిస్తాం. కొత్త పార్టీ పేరు విషయంలో అనేక మంది నుంచి సూచనలు వచ్చాయి. సుమారు 1500 పేర్లు సూచించారు. మా పార్టీ పేరు ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా, స్వతంత్రంగా ఉండాలని అనుకున్నాం. ఆవ రంగు వినూత్నతను సూచిస్తుంది. భిన్నత్వంలో ఏకత్వం అనే భావనను ప్రతిబింబిస్తుంది. శ్వేతవర్ణం శాంతికి, నీలం రంగు స్వేచ్ఛకు, ఆలోచనలకు, సముద్ర లోతులలో నుంచి ఆకాశం వరకు హద్దులను సూచిస్తుంది' అని ఆజాద్ తెలిపారు.
కశ్మీర్లో ఈ నెల ప్రారంభంలో నిర్వహించిన భారీ ర్యాలీలో కొత్త పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు ఆజాద్. పార్టీకి హిందుస్థానీ పేరు పెడతామని అప్పట్లో చెప్పారు. కశ్మీర్‌కు రాష్ట్ర హోదాపై తన పార్టీ పనిచేస్తుందని.. భూములు, ఉద్యోగాలపై హక్కులు స్థానికులకే ఉండేలా పోరాడతామని తెలిపారు. హస్తం పార్టీపైనా సభలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్.. తమ రక్తంతో తయారైందని వ్యాఖ్యానించారు. కొందరు తనను అగౌరపర్చేందుకు ప్రయత్నిస్తున్నారని, కానీ వారి ప్రయత్నాలన్నీ కంప్యూటర్లు, ట్వీట్లకే పరిమితమవుతాయని అన్నారు. కశ్మీర్‌కు ప్రత్యేక హోదా సాధ్యం కాదంటూ ఇటీవలే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కథనం కోసం లింక్‌పై క్లిక్చేయండి.