దేశ రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు రాకెట్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు త్రివిధ దళాల అధిపతి జనరల్ బిపిన్ రావత్ తెలిపారు. సరిహద్దుల్లో పాక్, చైనాల నుంచి ఎదురవుతున్న జాతీయ భద్రతా సవాళ్లను అధిగమించేందుకు సాంకేతికత వినియోగాన్ని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. భారత్‌కు వ్యతిరేకంగా ఇప్పటికే జమ్ము కశ్మీర్‌లో పరోక్ష యుద్ధం చేస్తున్న పాకిస్థాన్ ఇప్పుడు పంజాబ్ సహా ఇతర ప్రాంతాల్లో సమస్యలు సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని రావత్ పేర్కొన్నారు.
'రక్షణ వ్యవస్థ బలోపేతానికి రాకెట్ ఫోర్స్ ఏర్పాటు' - త్రివిధ దళాల అధిపతి ఎవరు?
భారత రక్షణ విభాగంలో రాకెట్ ఫోర్స్ ఏర్పాటు యోచనలో ఉన్నట్లు త్రివిధ దళాల అధిపతి జనరల్ బిపిన్ రావత్ వెల్లడించారు. రక్షణ రంగంలో సాంకేతికత వినియోగాన్ని పెంచాలని సూచించారు. రాకెట్ ఫోర్స్ భారత వైమానిక శక్తిని మరింత పెంపొందిస్తుందని ఆకాంక్షించారు. సాంకేతికతను జాతీయ శక్తికి ఐదో స్తంభంగా ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు.
శత్రువులు ప్రత్యక్ష దాడులకు తెగబడినా సాంకేతికను ఉపయోగించినా.. ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. భారత వైమానిక శక్తిని పెంపొందించేందుకు రాకెట్ ఫోర్స్ ఉపకరిస్తుందని రావత్ చెప్పారు. జాతీయ భద్రత సవాళ్లను ఎదుర్కొనేందుకు సాయుధ దళాల మధ్య సమైక్యతను పెంచడం ముఖ్యమన్న రావత్.. సాంకేతికత ప్రాధాన్యాన్ని త్రివిధ దళాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని..వివరించారు. దౌత్యం, సమాచారం, సైనిక, ఆర్థిక రంగాల తర్వాత సాంకేతికతను జాతీయ శక్తికి ఐదో స్తంభంగా పరిగణించాలని సీడీఎస్(CDS) స్పష్టంచేశారు.
ఇవీ చదవండి: