సమాజంలో ట్రాన్స్జెండర్లు వివక్షను (third gender equality) ఎదుర్కొంటున్నారు. పట్టణాల్లో కంటే గ్రామాల్లో వారిపై ఇది కాస్త ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు ట్రాన్స్జెండర్లను గ్రామాల్లో నాయకులుగా ఎన్నుకోవడం ఊహించలేం!. కానీ బిహార్ గయా జిల్లాలో ఓ ట్రాన్స్‌జెండర్‌కు ఏకగ్రీవంగా అధికారం కట్టబెట్టారు కేస్రా ధర్మాపుర్ పంచాయత్‌లో ఓ వార్డు ప్రజలు.
వార్డు మెంబర్‌గా ట్రాన్స్‌జెండర్.. తొలిసారి ఎన్నిక ఏకగ్రీవం!
బిహార్ గయా జిల్లా పంచాయతీ (third gender rights in india) ఎన్నికల్లో కేస్రా ధర్మాపుర్ ప్రజలు దేశం దృష్టిని ఆకర్షించారు. ఓ ట్రాన్స్‌జెండర్‌ను వార్డ్ మెంబర్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకొని ప్రజాస్వామ్యంలో వివక్షకు తావు లేదని నిరూపించారు.
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వార్డ్ నెంబర్ 5కి మెనూ కన్నార్ అనే ఓ ట్రాన్స్‌జెండర్ పోటీ చేయడానికి సిద్ధమవగా.. ప్రజలంతా మొదట్లో ఆశ్చర్యానికి గురయ్యారు. కానీ వివక్షను రూపుమాపడానికి ఆ అభ్యర్థినే ఎన్నుకోవాలని నిర్ణయించుకున్నారు. తమ వార్డు అభివృద్ధి బాధ్యతలను మెనూ కన్నార్ చేతిలోనే పెట్టారు. ఏకగ్రీవంగా ఓ ట్రాన్స్‌జెండర్ గెలుపొందడం బిహార్ చరిత్రలో ఇదే మొదటిసారి. దీంతో ప్రజాస్వామ్యంలో వివక్షకు తావు లేదని నిరూపించారు.
ఇదీ చదవండి:'ఆ శిశువుకు రెండు తలలు!'.. చూసేందుకు ఎగబడిన జనం!!