gangsters in mall: పంజాబ్‌లోని ఫిరోజ్‌పుర్‌కు చెందిన ఆరుగురు గ్యాంగ్‌స్టర్లు పోలీసుల నుంచి తప్పించుకుంటూ లుథియానాకు వచ్చి ఓ మాల్‌లోకి చొరబడ్డారు. మధ్యాహ్నం రెండున్నరకు మాల్‌లోకి వెళ్లిన నేరస్థులు ఎంతసేపటికీ బయటికి రాలేదు. లోపలికి వెళ్తే నేరస్థులు వినియోగదారులకు ఏదైనా కీడు చేస్తారన్న అనుమానం పోలీసులకు వచ్చింది. ఈ క్రమంలో పోలీసులు మాల్ సీసీటీవీని పరిశీలించి నేరస్థులు అక్కడే ఉన్నట్లు నిర్ధరించుకున్నారు. మాల్ సిబ్బంది సాయంతోనే వారిని పట్టుకునే వ్యూహం పన్నారు.
మాల్లో గ్యాంగ్‌స్టర్లు హల్చల్.. చాకచక్యంగా మాటువేసి..
gangsters in mall: అది పంజాబ్ లుథియానాలోని పెద్ద వాణిజ్య సముదాయం. సమయం మధ్యాహ్నం రెండున్నర. మాల్ వినియోగదారులతో కిటకిటలాడుతోంది. అదే సమయానికి ఆరుగురు కరుడుగట్టిన నేరస్థులు మాల్‌లోకి ప్రవేశించారు. ఎన్ని గంటలైనా వారు ఆ మాల్ నుంచి బయటకు రాలేదు. వారిని వెంబడిస్తూ వచ్చిన పోలీసులకు ఏం చేయాలో పాలుపోలేదు. లోపలికి వెళ్లి వారిని అరెస్ట్ చేద్దామంటే మాల్ వినియోగదారులతో రద్దీగా ఉంది. ఆ సమయంలో పోలీసులు ఏం చేశారు. ఆ గ్యాంగ్‌స్టర్లు తప్పించుకున్నారా? లేక పోలీసులకు పట్టుబడ్డారా?
మాల్లో గ్యాంగ్‌స్టర్లు హల్చల్
మధ్యాహ్నం రెండున్నరకు మాల్ లోపలికి వెళ్లిన నేరస్థులు రాత్రి ఎనిమిది గంటల తర్వాత మాల్ నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారు. అప్పటికే అక్కడ మాటువేసిన మాల్ సిబ్బంది సాయంతో పోలీసులు ఐదుగురు గ్యాంగ్‌స్టర్లను పట్టుకున్నారు. మరో వ్యక్తి వీళ్ల కళ్లు గప్పి అక్కడి నుంచి పారిపోయాడు. నేరస్థులు పారిపోయేందుకు ఉపయోగించిన వాహనాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చదవండి:బర్త్డే అని పిలిచి ప్రేయసికి నిప్పంటించి.. ఆపై తానూ!