తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఫ్రెండ్స్​తో కలిసి భార్యను రేప్​ చేసిన నిందితుడి ఫాంహౌస్​ కూల్చివేత - అత్యాచార ఘటనలో నిందితుడి ఫాంహౌస్​ కూల్చివేత

స్నేహితులతో కలిసి భార్యపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన మధ్యప్రదేశ్​ రియల్​ ఎస్టేట్​ వ్యాపారి ఫాంహౌస్​ను అధికారులు కూల్చివేశారు. ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా, రాజస్థాన్​కు చెందిన ఓ వ్యక్తి కన్న కూతురిపైనే అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

gangrape in madhya pradesh
gangrape in madhya pradesh

By

Published : Jan 17, 2022, 8:05 PM IST

మధ్యప్రదేశ్​ ఇండోర్​లో స్నేహితులతో కలిసి భార్యపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన రియల్​ ఎస్టేట్​ వ్యాపారి ఫాంహౌస్​ను అధికారులు కూల్చివేశారు. లక్ష చదరపు అడుగుల్లో ఉన్న ఫాం​హౌస్​​లో విలాసవంతమైన, ఖరీదైన బెడ్లు, సోఫాలు సహా ఇతర వస్తువులను గుర్తించారు. అందులోని ప్రత్యేక బార్​లో ఖరీదైన మద్యం సీసాలు, సెక్స్ బొమ్మలు సహా పలు అభ్యంతరకర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్పోర్ట్స్ సైకిళ్లు, ఆడి కారు సహా విలాసవంతమైన వాహనాలను సీజ్​ చేశారు. అనంతరం పోలీసులతో పాటు అక్కడికి చేరుకున్న ఇండోర్​ జిల్లా పాలనాయంత్రాంగం.. ఫాం​హౌస్​​ను పూర్తిగా నేలమట్టం చేశారు.

భారీ యంత్రాలతో ఫాంహౌస్​ను కూల్చివేస్తున్న అధికారులు
ఖరీదైనా సోఫాలు
ఫాం​హౌస్​లో కిచెన్​
ఫాంహౌస్​ లోపల ఖరీదైన అలంకరణలు

షిప్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఫాంహౌస్​​లో తనపై అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన అధికారులు.. ప్రధాన నిందితుడు సహా ఐదుగురుని అరెస్ట్​ చేశారు. నిందితులకు మానవ అక్రమ రవాణాతో ఏమైనా సంబంధాలున్నాయా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

గదుల్లో విలాసవంతమైన వస్తువులు
ఫాంహౌజ్​ కూల్చేందుకు వినియోగించిన భారీ యంత్రం

హత్యాచార కేసు నిందితులు అరెస్ట్​

మధ్యప్రదేశ్​ గ్వాలియర్​లో జరిగిన 14ఏళ్ల బాలిక హత్యాచారం ఘటనకు సంబంధించి ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్​ చేశారు. నిందితుల్లో ఇద్దరు ట్రక్కు డ్రైవర్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

గతేడాది డిసెంబరు 27న ఘటన

"గతేడాది డిసెంబరు 27న బాలిక పొరుగింటి వ్యక్తి సహా ఇద్దరు ట్రక్కు డ్రైవర్లు తమ వాహనంలో ఉత్తర్​ప్రదేశ్​లోని ఫరుఖాబాద్​కు తీసుకెళ్తామని ఆమెకు మాయ మాటలు చెప్పారు. నమ్మి వెళ్లిన బాలికపై కదులుతున్న వాహనంలోనే పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబుతుందనే భయంతో గొంతునులిమి చంపేశారు. మృతదేహాన్ని చంబల్​ నదిలో పడేశారు" అని పోలీసులు తెలిపారు.

కన్న కూతురుపై తండ్రి అత్యాచారం

రాజస్థాన్​ ఉదయ్​పుర్​లో అమానుష ఘటన జరిగింది. 16ఏళ్ల కూతురిపై కన్న తండ్రి ఏడాది కాలంగా అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగు చూసింది. మద్యం మత్తులో ఉన్నప్పుడల్లా ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై అఘాయిత్యానికి పాల్పడేవాడు. ఒకవేళ ఆమె కేకలు వేయడానికి ప్రయత్నిస్తే బెదిరించేవాడు. అయితే బాధితురాలు చివరికి తన తల్లికి చెప్పడం వల్ల విషయం బయటకు వచ్చింది.

బాలిక తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతను ఇప్పటికే అత్యాచారం కేసులో శిక్ష అనుభవించాడని పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి:ఏడాది క్రితం ఆ ఇంట్లో 'ఆత్మహత్య'.. ఇప్పుడు తలుపు తెరవగానే...

ABOUT THE AUTHOR

...view details