Two Girls Gang Rape: ఝార్ఖండ్‌లోని రాంచీలో దారుణం జరిగింది. ఇద్దరు బాలికలపై ఆరుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వారి బారి నుంచి తప్పించుకుని బాలికలిద్దరూ గురువారం అర్ధరాత్రి పోలీస్ స్టేషన్‌కు చేరుకుని జరిగిన విషయాన్ని పోలీసులకు తెలిపారు. వెంటనే చర్యలు తీసుకున్న పోలీసులు.. ఆరుగురు నిందితుల్లో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. రాజధానిలోని దుర్వా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. బాధితులు ఇద్దరినీ వైద్య పరీక్షల నిమిత్తం సదర్ ఆసుపత్రికి తరలించారు.
అసలు ఏం జరిగిందంటే?పోలీసుల కథనం ప్రకారం.. బాధితుల్లో ఓ బాలికను తన వదిన పొరుగింట్లో ఉన్న యువకుడితో బయటకు పంపించింది. మార్గమధ్యలో ఆ యువకుడు బాలికను ఎవరూ లేని ప్రాంతానికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ బాలిక తనను వదిలేయమని ప్రాధేయపడినా వదల్లేదు. అంతటితో ఆగకుండా నిందితుడు తన ఐదుగురు స్నేహితులను పిలిపించాడు. వారు వచ్చాక అందరూ కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే నిందితులు.. ఆ బాలికను తన స్నేహితురాలికి ఫోన్ చేసి పిలిపిస్తేనే వదిలేస్తామని చెప్పగా.. ఆమె వెంటనే పిలిచింది. ఆమె కూడా వచ్చాక ఆరుగురు కలిసి ఇద్దరు బాలికలపై గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు.