తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Lady CI Cheating: ‘500 నోట్లు ఇస్తే కోటి రూపాయలు ఇస్తాం’.. దందాకు మహిళా పోలీస్ నాయకత్వం..! - Lady CI Cheating in Visakha

Lady CI Cheating in Visakha: కొందరు ఈజీగా డబ్బు సంపాదించడం కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. అమాయకులను లక్ష్యంగా చేసుకుని.. వారికి ఆశ చూపించి వీళ్లు పని పూర్తిచేసుకుంటున్నారు. మోసపోయామని తెలుసుకునేలోపే.. సర్వం దోచేస్తున్నారు. అయితే ఇలాంటి మోసాలను అడ్డుకోవాల్సిన పోలీసులే.. డబ్బు కోసం వెంపర్లాడుతున్నారు. తాజాగా విశాఖలో జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనం.

Lady CI Cheating
Lady CI Cheating

By

Published : Jul 7, 2023, 10:11 AM IST

Gang Cheated With 2000 Notes: మాయగాళ్లు, మోసగాళ్లు ఎక్కువైపోయారు. తొందరగా డబ్బు సంపాదించడం కోసం అడ్డమైన దారులు తొక్కుతున్నారు. అత్యాశపరులు, అమాయకులనే లక్ష్యంగా చేసుకుని వారి పని కానిచ్చుకుంటున్నారు. ఎక్కువ డబ్బు ఆశ చూపించి అందిన కాడికి అడ్డంగా దోచేస్తున్నారు. పక్క వాళ్ల దగ్గర డబ్బులు ఉన్నాయి అనే తెలిస్తే చాలు.. వాటిని దండుకోవడానికి అనేక మాయోపాయాలు చేస్తున్నారు. మోసపోయామని బాధితులు గ్రహించే లోపే డబ్బుతో ఉడాయిస్తున్నారు. ఇటీవల 2 వేల రూపాయల నోట్లను వెనక్కి తీసుకుంటున్నట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రకటన చేసిన నేపథ్యంలో.. దీనిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు అన్ని రకాల కుయుక్తులు పన్నుతున్నారు. అయితే ఇలాంటి మోసాలను అరికట్టి.. బాధితులకు న్యాయం చేయాల్సిన పోలీసులే.. డబ్బుకు ఆశపడి అవినీతికి పాల్పడుతూ.. అందినకాడికి దోచుకుంటున్నారు. ఇలాంటి అధికారుల కారణంగా మొత్తం పోలీస్ వ్యవస్థకే చెడ్డపేరు వస్తోంది. తాజాగా విశాఖలో వెలుగు చూసిన ఘటన అందరిని విస్మయానికి గురి చేస్తోంది.

విశాఖపట్నంలో రెండు వేల రూపాయల నోట్ల మార్పిడి నేపథ్యంలో జరిగిన పరిణామాలు పోలీసుశాఖలో కలకలం రేపుతున్నాయి. తనిఖీల్లో భాగంగా ఆ సొమ్మును గుర్తించిన ఓ పోలీసు అధికారిణి.. భారీ మొత్తంలో ఆ నోట్లను తీసుకున్నట్లు విశాఖ సీపీకి ఫిర్యాదు అందింది. దీంతో ఆ ఫిర్యాదుపై పోలీసులు విచారణ చేస్తున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. విశాఖపట్నం కమిషనరేట్‌ పరిధిలో పెద్ద మొత్తంలో 2 వేల రూపాయల నోట్ల మార్పిడికి రెండు రోజుల క్రితం కొందరు వ్యక్తులు యత్నించారు. సుమారు 90 లక్షల రూపాయల విలువైన 500 నోట్లు ఇస్తే.. రూ.కోటి విలువైన 2 వేల నోట్లు ఇస్తామన్న ఒప్పందంతో డబ్బు చేతులు మారింది. అదే రోజు ఆర్కే బీచ్‌రోడ్డులో తనిఖీ చేస్తుండగా ఇద్దరి వద్ద భారీగా డబ్బు చిక్కింది. తనిఖీల్లో ఉన్న ఒక మహిళా సీఐ నగదంతా రూ.2వేల నోట్లుగా గుర్తించి ఆరా తీయగా.. వారు కమీషన్‌ ప్రాతిపదికన నోట్లు మారుస్తున్నట్లు తేలింది.

అయితే ఆ నగదుకు ఆధారాలు లేవని తెలిసి.. ఆమె ఆ సొమ్ములో నుంచి దాదాపు రూ.20 లక్షలు తీసుకుని బాధితులను హెచ్చరించి పంపించేశారు. ఈ విషయం ఎవరికైనా చెబితే మొత్తం డబ్బు సీజ్‌ చేస్తామంటూ భయపెట్టినట్లు సమాచారం. నౌకాదళ విశ్రాంత ఉద్యోగుల డబ్బు కూడా ఇందులో ఉండటంతో వాటికి లెక్కలున్నాయని.. వారు ఆమె వద్దకు వెళ్లినట్లు సమాచారం. వారిని కూడా ఆమె బెదిరించి పంపేశారు. బాధితులు తమ వద్ద ఉన్న ఆధారాలతో విశాఖ సీపీ త్రివిక్రమ వర్మకు ఫిర్యాదు చేశారు. సీపీ ఆదేశాల మేరకు పోలీసు ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. వాస్తవాలపై స్పష్టత రావడంతో ఆమెపై చర్యలు తీసుకొనేందుకు అధికారులు సమాయత్తమవుతున్నట్లు తెలిసింది. అయితే ఆమెకు అనుకూలంగా అధికార పార్టీ పెద్దలు పావులు కదుపుతున్నట్లు తెలిసింది.

ABOUT THE AUTHOR

...view details