తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సీట్ల సర్దుబాటపై భాజపా, అన్నాడీఎంకే భేటీ

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా, అన్నాడీఎంకే కలిసి పోటీ చేయనున్నాయి. ఈ నేపథ్యంలో సీట్ల సర్దుబాటుపై చర్చించేందుకు కేంద్ర మంత్రి, రాష్ట్ర భాజపా ఎన్నికల ఇంఛార్జి కిషన్​ రెడ్డి, ముఖ్యమంత్రి పళనిస్వామితో సమావేశమయ్యారు.

G Kishan Reddy meets Tamil Nadu CM to discuss seat-sharing ahead of assembly polls
సీట్ల సర్దుబాటపై భాజపా,అన్నాడీఎంకే భేటీ

By

Published : Feb 27, 2021, 3:50 PM IST

Updated : Feb 27, 2021, 3:58 PM IST

నాలుగు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరికి శుక్రవారం.. ఎన్నికల షెడ్యూల్​ను ప్రకటించింది కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ). ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో పొత్తులపై చర్చలు ఊపందుకున్నాయి. ఈ సారి తమిళనాట పుంజుకొనే దిశగా భాజపా.. అధికార అన్నాడీఎంకేతో జట్టు కట్టింది. ఈ క్రమంలో సీట్ల సర్దుబాటు విషయంపై చర్చించేందుకు భాజపా రాష్ట్ర ఎన్నికల ఇంఛార్జి, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్​ రెడ్డి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్​ మురుగన్​లు ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉపముఖ్యమంత్రి పన్నీర్​ సెల్వంతో సమావేశమ్యయారు.

తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో ఏప్రిల్​ 6న ఎన్నికలు జరుగుతాయి. మే 2న ఫలితాలు వెల్లడించనున్నారు.

డీఎంకే- కాంగ్రెస్​ కూటమిని ఎదుర్కొనేందుకు.. భాజపా- అన్నాడీఎంకే వ్యూహాలు రచిస్తున్నాయి. 2019 లోక్​సభ ఎన్నికల్లో 'అన్నాడీఎంకే' కు ఊహించని షాక్​ తగిలింది. 39 స్థానాలకు గానూ.. 38 చోట్ల డీఎంకేనే జయభేరి మోగించింది.

కరోనా సమయంలో బిహార్​ ఎన్నికల తరువాత నిర్వహించే ఈ పోలింగ్​కు ఈసీ తగిన ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు పోలింగ్​ సమయాన్ని గంట పెంచారు.

Last Updated : Feb 27, 2021, 3:58 PM IST

ABOUT THE AUTHOR

...view details