స్నేహం ముసుగులో ఓ మైనర్‌పై రెండు సార్లు సామూహిక అత్యాచారం చేశారు దుర్మార్గులు. ఈ ఘటనకు సంబంధించి ఐదుగురు నిందితులను బెంగళూరు హనుమంతనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఏం జరిగింది?
ఈ కేసులో ప్రధాన నిందితుడైన వెంకటేశ్.. 10వ తరగతి చదువుతున్నాడు. కార్పెంటర్‌గా పనిచేస్తున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ మైనర్ బాలికతో పరిచయం పెంచుకున్నాడు. ఇరువురు ఫోన్ నెంబర్లు సైతం తీసుకున్నారు. వెంకటేశ్.. ఈ విషయాన్ని తన స్నేహితులకు చెప్పాడు. నవంబర్ 8న వెంకటేశ్.. తన స్నేహితులతో కలిసి కారులో బాలికను పార్కుకు తీసుకెళ్లారు. అక్కడ వెంకటేశ్‌తో పాటు మరో ఇద్దరు బాలికపై అత్యాచారం చేసి.. ఇంట్లో వదిలివెళ్లారు. అయితే పరువు పోతుందని బాలిక తల్లిదండ్రులు ఈ విషయాన్ని పోలీసులకు చెప్పలేదు.
అమ్మమ్మ, తాతయ్యల ఫిర్యాదుతో..
ఆ తరువాత ఆన్లైన్ క్లాసుల పేరుతో వెంకటేశ్‌తో ఆన్లైన్లో చాటింగ్ చేసేదా బాలిక. నిందితుడు గుత్తహళ్లీలోని తన స్నేహితుడి ఇంటికి జనవరి 18 అర్ధరాత్రి రప్పించి మరోసారి అఘాయిత్యానికి పాల్పడ్డారు. బాలిక కనపడటం లేదంటూ ఆమె అమ్మమ్మ, తాతయ్య స్థానికంగా పెట్రోలింగ్ చేస్తున్న పోలీస్ అధికారికి ఫిర్యాదు చేశారు. ఆ పోలీస్ అధికారి వెంటనే పై అధికారులకు సమాచారం ఇచ్చాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీస్ బృందం వెంటనే గాలింపు జరిపింది. ఈ కేసుకు సంబంధించి ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వీళ్లు కే.జే నగర్‌కు చెందిన వెంకటేశ్, చేతన్, లేఖన్, రక్షక్, అభిషేక్లుగా గుర్తించారు. మరో నిందితుడు బాబు కోసం గాలిస్తున్నారు.
ఇదీ చదవండి :కర్ణాటకలో పేలుడు- ఎనిమిది మంది మృతి!