తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రేషన్ కార్డు హోల్డర్లకు గుడ్​న్యూస్ - మరో ఐదు సంవత్సరాల పాటు ఆ స్కీమ్​ను పొడిగించిన కేంద్రం!

Free Ration Scheme Extends 5 More Years : రేషన్ కార్డు హోల్డర్లకు కేంద్ర సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఉచిత బియ్యం పథకంపై మోదీ సర్కార్ కీలక ప్రకటన చేసింది. ఇంతకీ కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేసింది? ఎవరికి లాభం? ఎంత వరకు ప్రయోజనం కలుగుతుంది? వంటి వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Free_Ration_Scheme_Extends_5_More_Years
Free_Ration_Scheme_Extends_5_More_Years

By ETV Bharat Telugu Team

Published : Nov 16, 2023, 4:49 PM IST

Free Ration Scheme to be Extended for Five Years :ఐదు రాష్ట్రాల ఎన్నికల వేళ రేషన్ కార్డు హోల్డర్లకు కేంద్ర ప్రభుత్వం గుడ్​న్యూస్ చెప్పింది. ఆహార భద్రత చట్టం కింద దేశంలో ఇప్పటికే అమలులో ఉన్న ఉచిత రేషన్ పథకాన్ని(Free Ration Scheme) మరో ఐదేళ్లు పొడిగిసున్నట్లు ప్రకటించారు. ఇటీవల ఛత్తీస్​గఢ్​లో నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభలో ప్రధాని మోదీ ఈ ప్రకటన చేశారు. దీంతో దేశవ్యాప్తంగా 80 కోట్ల మంది పేదలు ప్రయోజనం పొందనున్నారు.

Free Ration Scheme Extends in India :కేంద్ర ప్రభుత్వం 2020 కరోనా సమయంలో ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్నా యోజన(PMGKAY) స్కీమ్​ను ప్రారంభించింది. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్న పేదలందరికీ ఉచిత రేషన్ బియ్యం అందిస్తోంది. అయితే మొదట ఈ స్కీమ్​ను రెండు సంవత్సరాల వరకు కొనసాగించాలని కేంద్రం భావించింది. కానీ, 2022 డిసెంబర్ 31న నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్(NFSA)లో దీన్ని వీలినం చేసింది. దాంతో అప్పటి నుంచి ఆహార భద్రత కార్డు(Ration Card) ఉన్న లబ్ధిదారులందరికీ ఈ ఉచిత రేషన్ బియ్యం పథకాన్ని కేంద్ర సర్కార్ కొనసాగిస్తోంది. 2020లో ప్రారంభమైన ఈ స్కీమ్​ని ఇప్పటికే పలుమార్లు కేంద్రం పొడిగించింది. అయితే ఈ ఏడాది డిసెంబర్​తో ఈ ఉచిత రేషన్ స్కీమ్ గడువు ముగియనుంది.

How to Apply for One Nation One Ration Card : ఈ కార్డు ద్వారా ఎక్కడి నుంచైనా రేషన్ పొందవచ్చు.. ఇప్పుడే అప్లై చేసుకోండి..!

ఈ క్రమంలో తాజాగా ఐదు రాష్ట్రాల ఎన్నికల వేళ మరోసారి ఫ్రీ రేషన్​ను ఇంకో ఐదు సంవత్సరాల పాటు కొనసాగించనున్నట్లు మోదీ ప్రకటించారు. దీంతో జాతీయ ఆహార భద్రత చట్టం(National Food Security Act-2013) కింద ఇంకో ఐదేళ్లు పేదలందరికీ రేషన్ బియ్యం ఉచితంగానే అందనున్నాయి. అంటే 2028 డిసెంబర్ వరకు కేంద్రం ఈ స్కీమ్ కింద ఉచితం రేషన్ బియ్యం పంపిణీ చేయనుంది. అయితే NFSA కింద గ్రామీణ జనాభాలో 75 శాతం, పట్టణ జనాభాలో 50 శాతం మంది ప్రయోజనం పొందుతున్నారు.

కేంద్ర ప్రభుత్వం కొవిడ్ కంటే ముందు రేషన్ కార్డు ఉన్న వారికి కిలో బియ్యాన్ని సబ్సిడీ ధరతో రూ. 1-3 వరకు అందించేది. ఐదు కేజీల చొప్పు ఒక్కొక్కరికీ కేటాయించేది. అలాగే అంత్యోదయ అన్న యోజన(AAY)కుటుంబాలకు 35 కిలోల బియ్యాన్ని పంపిణీ చేసేది. బియ్యంతో పాటు తృణ ధాన్యాలు, గోధుమలు రూ. 1 నుంచి 3కే అధిక సబ్సిడీ రేటుకు కేంద్ర ఇచ్చేది. అయితే ఈ స్కీమ్ అమలులోకి వచ్చినప్పటినుంచి కేంద్రం ఒక్క పైసా కూడా తీసుకోకుండా పేదలకు ఉచితంగా రేషన్ బియ్యం పంపిణీ చేస్తోంది.

How Many Types of Ration Cards in India : మీరు ఏ రకమైన రేషన్ కార్డు కలిగి ఉన్నారో.. వాటి లాభాలేంటో తెలుసా..?

Telangana Ration Card Holders Must Complete KYC Registration: అలా చేయకపోతే.. మీకు రేషన్ కార్డు రద్దయిపోతుంది!

ABOUT THE AUTHOR

...view details