తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆడుకుంటూ బోరుబావిలో పడిన చిన్నారి - ఉత్తర్​ప్రదేశ్ వార్తలు

ఉత్తర్​ప్రదేశ్‌, ఫతేహాబాద్ జిల్లాలో నాలుగేళ్ల బాలుడు ఆడుకుంటూ వెళ్లి బోరుబావిలో పడిపోయాడు. చిన్నారిని సురక్షితంగా బయటకు తీసేందుకు సహాయక చర్యలు ప్రారంభించారు.

four year old fell in borewell
ఆడుకుంటూ వెళ్లి బోరుబావిలో పడిన నాలుగేళ్ల చిన్నారి

By

Published : Jun 14, 2021, 12:29 PM IST

ఆడుకుంటూ వెళ్లి బోరుబావిలో పడిన నాలుగేళ్ల చిన్నారి

నాలుగేళ్ల చిన్నారి ఆడుకుంటూ వెళ్లి బోరుబావిలో పడిన ఘటన ఉత్తర్​ప్రదేశ్‌, ఫతేహాబాద్ జిల్లా ధారియాయి గ్రామంలో జరిగింది. గ్రామంలో నివసించే చోటెలాల్​ తన ఇంటి ముందు గతంలో బోరుబావిని తవ్వించాడు. దానికి అమర్చిన పైపులు రెండు రోజుల క్రితం తీసేశాడు. బోరుగుంతను అలాగే వదిలేశాడు.

రోదిస్తున్న బాలుని కుటుంబ సభ్యులు

చోటెలాల్​ కుమారుడు శివ(4) ఆడుకుంటూ బోరుబావిలో పడిపోయాడు. తోటి స్నేహితులు ఆ బాలుని తల్లితండ్రులకు సమాచారం అందించారు. అనంతరం గ్రామస్థులు పోలీసులకు విషయం తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. బోరు బావిలో చిక్కుకున్న తమ చిన్నారి సురక్షితంగా బయటకు రావాలంటూ... కుటుంబసభ్యులు దేవుణ్ని వేడుకుంటున్నారు.

సహాయక చర్యల్లో పోలీసులు

ABOUT THE AUTHOR

...view details