హిమాచల్‌ప్రదేశ్‌లోని ఉనా జిల్లాలో విషాదం నెలకొంది. మురికివాడలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో గుడిసెలో నిద్రిస్తున్న నలుగురు చిన్నారులు సజీవదహనమయ్యారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని బనే డి హట్టి ప్రాంతంలోని మురికివాడలో బుధవారం రాత్రి 11 గంటల తర్వాత ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో బిహార్‌కు చెందిన కూలీ కుటుంబం అక్కడే నిద్రిస్తోంది. మంటలు గమనించిన స్థానికులు.. అదుపు చేసేందుకు ప్రయత్నించారు. కానీ అప్పటికే నలుగురు పిల్లలు మంటల్లో చిక్కుకుని మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. చిన్నారుల మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. చనిపోయిన చిన్నారులు తోబుట్టువులని పోలీసులు తెలిపారు.
ఉద్యోగులపైకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణం జరిగింది. రోడ్డు పక్కన బస్సు కోసం వేచి చూస్తున్న ఉద్యోగులపైకి మరో బస్సు దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు మృతిచెందగా.. మరో ముగ్గురు గాయపడ్డారు.
పోలీసుల సమాచారం ప్రకారం..
బాదల్‌పుర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో హీరో మోటర్స్ కంపెనీలో పనిచేస్తున్న కార్మికులు.. తమ షిఫ్ట్ అయిపోయాక రాత్రి 11.30 గంటల ప్రాంతంలో రోడ్డు మీద వేచి ఉన్నారు. అదే సమయంలో దాద్రీ నుంచి నోయిడా డిపోకు వెళ్తున్న ఓ బస్సు.. వారిపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు అక్కిడకిక్కడే మరణించారు. మరో ముగ్గురు గాయపడ్డారు.
మరణించిన వారిలో ముగ్గురు బిహార్‌కు చెందిన ఉద్యోగులుగా పోలీసులు గుర్తించారు. నలుగురి మృతదేహాలను శవపరీక్షల నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ వారిని నిఠారీ ఆస్పత్రిలో చేర్పించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం దిల్లీలో సఫ్దర్‌జంగ్ హాస్పిటల్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బస్సు డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.