తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దిల్లీ సరిహద్దులో రైతు స్మారకం

సాగు చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనల్లో మరణించిన అన్నదాతలకు గుర్తుగా దిల్లీ సరిహద్దులో నిర్మించతలపెట్టిన అమరవీరుల స్మారకానికి పునాది పడింది. బీకేయూ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. 'మట్టి సత్యాగ్రహం' ద్వారా వివిధ ప్రాంతాల నుంచి రైతులు సేకరించిన మట్టిని ఈ నిర్మాణంలో ఉపయోగించనున్నారు.

Foundation laid for 'memorial' to farmers who died during course of protest against agri laws
దిల్లీ సరిహద్దుల్లో రైతు స్మారక చిహ్నానికి శ్రీకారం

By

Published : Apr 7, 2021, 12:07 PM IST

సాగు చట్టాలకు వ్యతిరేకంగా సాగుతున్న ఆందోళనల్లో మరణించిన రైతులకు గుర్తుగా.. తలపెట్టిన స్మారకానికి శంకుస్థాపన చేసింది బీకేయూ. గాజీపూర్-ఘజియాబాద్(యూపీ గేట్) సరిహద్దులో ఈ కార్యక్రమం జరిగింది.

సరిహద్దులో నిర్మించబోయే స్మారకానికి బీకేయూ నాయకుడు రాకేశ్ టికాయిత్​, సామాజిక కార్యకర్త మేధా పాట్కర్ మంగళవారం పునాది వేశారు. నిరసనల్లో మొత్తం 320 మంది రైతులు మరణించారని బీకేయూ పేర్కొంది. ఆయా రైతులకు గుర్తుగా.. వారి గ్రామాల నుంచి మట్టిని తీసుకువచ్చినట్టు తెలిపింది.

అంతేగాక స్వాతంత్య్రోద్యమ అమరవీరులు నివసించిన ప్రాంతాల నుంచీ మట్టిని తీసుకొచ్చి వినియోగించనున్నట్టు పేర్కొంది.

అమరవీరుల స్మారకం నిర్మాణం కోసం 'మిట్టి సత్యాగ్రహ యాత్ర'ను బీకేయూ నిర్వహించింది. 50 మంది సామాజిక కార్యకర్తల బృందం అన్ని రాష్ట్రాల నుంచి మట్టిని సేకరించింది. భగత్ సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురు, చంద్ర శేఖర్ ఆజాద్, రామ్ ప్రసాద్ బిస్మిల్, అష్ఫకుల్లా ఖాన్ వంటి స్వాతంత్య్ర సమరయోధుల గ్రామాల నుంచి మట్టిని సేకరించినట్లు బీకేయూ తెలిపింది.

అయితే ఈ స్మారకానికి సంబంధించి భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. స్మారకాన్ని శాశ్వతంగా నిర్మించనున్నట్లు బీకేయూ ప్రకటించింది. కానీ బీకేయూ వేసిన పునాది.. అమరులైన రైతులకు చిహ్నంగానే నిలుస్తుందని.. అది శాశ్వతం కాదని ఘజియాబాద్ జిల్లా మేజిస్ట్రేట్ అజయ్ శంకర్ పాండే స్పష్టం చేశారు.

ఇవీ చదవండి:సాగు చట్టాలను నిరసిస్తూ ఉపాధ్యాయుడు ఆత్మహత్య

రైతుల మట్టి సత్యాగ్రహం- అమరులకు స్తూపం

ABOUT THE AUTHOR

...view details