తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కాంగ్రెస్​కు మరో ఎదురుదెబ్బ.. కేంద్ర మాజీ మంత్రి రాజీనామా

Ashwani Kumar: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్​కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్​ నేత, కేంద్ర మాజీ మంత్రి రాజీనామా చేశారు.

అశ్వనీకుమార్​
aswini kumar

By

Published : Feb 15, 2022, 12:42 PM IST

Updated : Feb 15, 2022, 1:07 PM IST

Ashwani Kumar: కాంగ్రెస్​ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. మాజీ న్యాయశాఖ మంత్రి అశ్వనీ కుమార్ మంగళవారం.. ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి పంపారు. కాంగ్రెస్​తో తనకున్న 46 ఏళ్ల అనుబంధానికి ముగింపు పలికారు. జాతీయ ప్రయోజనాల కోసం పార్టీ వెలుపలే ఉత్తమంగా సేవ చేయగలనని ఆయన రాజీనామా లేఖలో చెప్పారు.

" ప్రస్తుత పరిస్థితుల్లో నా గౌరవానికి అనుగుణంగా నిర్ణయం తీసుకున్నాను. జాతీయ ప్రయోజనాల కోసం పార్టీ వెలుపలే ఉత్తమంగా సేవ చేయగలను. పార్టీతో నా 46 సంవత్సరాల అనుబంధానికి ముగింపు పలుకుతున్నాను. స్వాతంత్య్ర సమరయోధులు ఊహించిన ఉదార ​​ప్రజాస్వామ్యం కోసం కృషి చేస్తాను."

- రాజీనామా లేఖలో అశ్వనీ కుమార్​

2002 నుంచి 2014 వరకు వరుసగా మూడు సార్లు అశ్వనీ కుమార్​ రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యారు. 2012 అక్టోబరు 28 నుంచి 2013 మే 10 వరకు కేంద్ర​ న్యాయశాఖ మంత్రిగా సేవలందించారు.

ఇటీవల సీనియర్​ నేత ఆర్‌పీఎన్‌ సింగ్‌ కాంగ్రెస్‌ నుంచి వైదొలిగిన నేపథ్యంలో ఈ రాజీనామాకు ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ మధ్యకాలంలో జ్యోతిరాదిత్య సింధియా, జితిన్ ప్రసాద, సుస్మితా దేవ్ వంటి సీనియర్​ నేతలు కూడా పార్టీని వీడారు.

ఇదీ చదవండి:దాణా స్కామ్​ ఐదో కేసులోనూ లాలూ దోషి- త్వరలోనే మళ్లీ జైలుకు..

Last Updated : Feb 15, 2022, 1:07 PM IST

ABOUT THE AUTHOR

...view details