తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వైఎస్సార్సీపీతో వెళ్తే అనుకున్న లక్ష్యాలను సాధించలేను: అంబటి రాయుడు - అంబటి ఆన్ జగన్

Former Cricketer Ambati Rayudu Meets Janasena Chief Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్​తో మాజీ క్రికెటర్ అంబటి రాయుడు భేటీ అయ్యారు. రాయుడితో పవన్ మూడు గంటలపాటు చర్చలు జరిపారు. పవన్​తో సమావేశం అనంతరం అంబటి రాయుడు ట్విట్టర్​లో స్పందించారు.

Former Cricketer ambati rayudu meets janasena chief pawan kalyan
Former Cricketer ambati rayudu meets janasena chief pawan kalyan

By ETV Bharat Telugu Team

Published : Jan 10, 2024, 2:06 PM IST

Updated : Jan 10, 2024, 10:16 PM IST

Former Cricketer Ambati Rayudu Meets Janasena Chief Pawan Kalyan:జనసేన అధినేత పవన్ కల్యాణ్​తో మాజీ క్రికెటర్ అంబటి రాయుడు భేటీ అయ్యారు. గుంటూరు జిల్లా మంగళగిరి జనసేన కార్యాలయంలో అంబటి రాయుడితో పవన్ మూడు గంటలపాటు చర్చలు జరిపారు. పవన్​తో భేటీ అనంతరం అంబటి రాయుడు ట్విట్టర్ (ఎక్స్) ద్వారా స్పందించారు.

వైఎస్సార్సీపీతో కలసి: ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చానని అంబటి రాయుడు తెలిపారు. తాను అనుకున్న ఆలోచనలు, కలలు సాకారమవుతాయని వైఎస్సార్సీపీలో చేరినట్లు వెల్లడించారు. క్షేత్రస్థాయిలో అనేక గ్రామాల్లో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకొని, వ్యక్తిగతంగా సాధ్యమైనంత మేరకు సాయం చేసే ప్రయత్నం చేసినట్లు తెలిపారు. అయితే, కొన్ని కారణాల వల్ల వైఎస్సార్సీపీతో కలసి ముందుకెళ్తే తాను అనుకున్న లక్ష్యాలను సాధించలేనని అర్థమైందని రాయుడు పేర్కొన్నారు. ఈ విషయంలో తాను ఎవరినీ తప్పుబట్టడం లేదని, తన ఆలోచనలు వైఎస్సార్సీపీ ఆలోచనలు భిన్నంగా ఉన్నాయన్నారు. అందుకే ఎన్నికల్లో ఫలానా స్థానం నుంచి పోటీ చేయాలని అనుకోలేదని రాయుడు తెలిపారు.

పవన్‌ కల్యాణ్‌తో క్రికెటర్‌ అంబటి రాయుడు భేటీ

ఆయన్ను అర్థం చేసుకొనేందుకు: కొన్ని కారణాల వల్ల ఇక రాజకీయాలకు దూరంగా ఉండాలనుకున్నట్లు అంబటి రాయుడు పేర్కొన్నారు. ఈ నిర్ణయం తీసుకునే ముందు ఒకసారి పవన్‌ అన్నను కలవమని నా స్నేహితులు, శ్రేయోభిలాషులు సలహా ఇచ్చారని, ఆయన సిద్ధాంతాల గురించి తెలుసుకోమన్నారని తెలిపారు. అందుకే పవన్‌ను కలసి మాట్లాడానని. జీవితం, రాజకీయాలతో పాటు ఆయన్ను అర్థం చేసుకొనేందుకు ప్రయత్నించినట్లు రాయుడు తెలిపారు. మా ఇద్దరి ఆలోచనల్లో సారూప్యత కనిపించిందని, పవన్ కల్యాణ్​ను కలిసినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రస్తుతానికి ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ లీగ్‌ కోసం త్వరలోనే దుబాయ్‌ వెళ్తున్నట్లు రాయుడు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.
నేనెప్పుడూ రాజీ పడలేదు.. అలా అయితే మంచి క్రికెటర్ కాలేరు : అంబటి రాయుడు​

పది రోజులకే:అంబటి రాయుడు ఇటీవలే వైఎస్సార్​సీపీకి రాజీనామా చేశారు. పార్టీలో చేరిన పది రోజులకే పార్టీని వీడడం చర్చనీయాంశంగా మారింది. అనంతరం ఈ రోజు మంగళగిరిలో జనసేన పార్టీ కార్యాలయంలో పవన్​తో భేటీ కావడం మరింత చర్చకు దారి తీసింది. తనకు టికెట్ ఇస్తానని చెప్పి వైఎస్సార్సీపీ మోసం చేసిందని అంబటి గుర్రుగా ఉన్నట్లు వార్తలు వెలువడిన నేపథ్యంలో పవన్​తో అంబటి చర్చలు జరపడం ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

గ్రౌండ్​లోకి వెళ్లకుండానే రాయుడు డక్కౌట్ :డిసెంబర్ 28న సీఎం జగన్, డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి సమక్షంలో అంబటి రాయుడు వైఎస్సార్సీపీలో చేశారు. పార్టీలో అడుగు పెట్టిన పది రోజుల్లోనే పార్టీ నుంచి యూటర్న్ తీసుకోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ కొద్ది సమయంలోనే పార్టీ వీడటంతో రాజకీయ నిపుణలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గ్రౌండ్​లోకి వెళ్లకముందే అంబటి వికెట్‌ పడటంతో అధికార వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తల్లో తీవ్ర గందరగోళం నెలకొంది.
ఆడుదాం ఆంధ్రాలో జగన్​కు ఝలక్​ - ఆడలేనంటూ అంబటి రాయుడు హిట్ వికెట్!

Last Updated : Jan 10, 2024, 10:16 PM IST

ABOUT THE AUTHOR

...view details