ముంబయి ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా విదేశీ కరెన్సీ పట్టుబడింది. అక్కడి నుంచి దుబాయ్ వెళ్తున్న ముగ్గురు భారతీయుల నుంచి 4,97,000 డాలర్ల (సుమారు 4.1 కోట్ల రూపాయలు) నగదును కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
బుధవారం ఉదయం పక్కా సమాచారం అందుకున్న ఎయిర్‌పోర్ట్ కస్టమ్స్ ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ దుబాయ్‌కు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులను అడ్డగించింది. అనుమానంతో వారి బ్యాగ్‌లను పరిశీలించగా భారీ మొత్తంలో నగదు దొరికింది. వారు బ్యాగ్‌లో, చెప్పులు, చీరల్లో ఈ నగదును దాచినట్లు అధికారులు తెలిపారు. ఈ ముగ్గురిని అరెస్టు చేసి స్థానిక కోర్టు తరలించారు. న్యాయస్థానం ఆదేశాలతో జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు.
ఆ ఫ్యామిలీపై డౌట్ వచ్చి చెకింగ్.. చీరలు, చెప్పుల్లో రూ.4కోట్లు
ముంబయి విమానాశ్రమంలో భారీగా విదేశీ కరెన్సీ పట్టుబడింది. దుబాయ్ వెళ్తున్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తుల బ్యాగ్‌లో, చీరల్లో, చెప్పుల్లో భారీ మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు గురువారం వెల్లడించారు.
currency seized
Last Updated : Nov 3, 2022, 2:28 PM IST