ఈ నెల 16 నుంచి ప్రారంభంకానున్న కరోనా టీకా పంపిణీ కార్యక్రమానికి ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. ఇందుకు సంబంధించి ఇప్పటికే రెండు టీకాలకు అనుమతులిచ్చింది కేంద్రం. అయితే ఈ రెండు టీకాల్లో(కొవాగ్జిన్, కొవిషీల్డ్)లో మనకు నచ్చిన టీకాను తీసుకోవచ్చా? అన్న ప్రశ్న ప్రజల్లో ఉంది. తాజాగా దీనిపై కేంద్రం స్పష్టతనిచ్చింది. ప్రస్తుతానికి.. టీకా ఎంచుకునే అవకాశం ప్రజలకు ఇవ్వడం లేదని పేర్కొంది.
"ప్రపంచంలోని చాలా దేశాల్లో ఒకటికి మించి కరోనా టీకాలను వినియోగిస్తున్నారు. కానీ ప్రస్తుతానికి ఎక్కడా.. వ్యాక్సిన్‌ను ఎంపిక చేసుకునే అవకాశం ప్రజలకు లేదు. భారత్‌లోనూ అంతే. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రజలు వ్యవహరించాలని అభ్యర్థిస్తున్నాం."
-- రాజేశ్ భూషణ్, కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి.