Foetuses Dumped in Nagpur: మహారాష్ట్రలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. నాగ్‌పూర్ క్వెట్టా కాలనీలోని కాంపౌండ్ వాల్ సమీపంలో ఐదు పిండాలు, కొన్ని మానవ శరీర భాగాలను గుర్తుతెలియని వ్యక్తులు పడేసినట్లు పోలీసులు తెలిపారు. ఒక కిడ్నీ, ఎముకలు కూడా ఉన్నట్లు వెల్లడించారు. ఘటనాస్థలానికి సమీపంలో ఉన్న ఆస్పత్రి నుంచే ఈ అవశేషాలను పడవేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
చెత్త కుప్పలో ఐదు పిండాలు, మానవ శరీర భాగాలు.. - human body parts in Nagpur
Foetuses Dumped in Nagpur: నాగ్‌పుర్‌లో అమానవీయ ఘటన జరిగింది. ఓ కాలనీలోని కాంపౌండ్ వాల్ సమీపంలో ఐదు పిండాలు, కొన్ని మానవ శరీర భాగాలను గుర్తుతెలియని వ్యక్తులు పడేసినట్లు పోలీసులు తెలిపారు.
మొదట పిండాలను గుర్తించిన ఓ బాటసారి పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు అక్కడికి చేరుకుని ఫోరెన్సిక్ నిపుణుల బృందాన్ని పిలిపించారు. ఈ ఘటనపై స్పందించిన డీసీపీ గజానన్ రాజమనేని.. "అబార్షన్‌లు చట్టబద్ధంగా జరిగాయా? లేదా చట్టవిరుద్ధంగా జరిగాయా? అని తెలుసుకోవడానికి దర్యాప్తు చేస్తున్నాం" అని చెప్పారు. బయోమెడికల్ వ్యర్థాలు సమీపంలోని ఆస్పత్రివేనని సూచించే కొన్ని మందుల పెట్టెలను కూడా పోలీసులు కనుగొన్నారు. సీసీటీవీ ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఇదీ చదవండి:రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. సర్పంచ్ దారుణ హత్య