తెలంగాణ

telangana

ETV Bharat / bharat

11 నెలల అబ్బాయి కడుపులో పిండం.. అసలు ఎందుకిలా?

పదకొండు నెలల బాబు కడుపులో ఉన్న పిండాన్ని అరుదైన శస్త్ర చికిత్స ద్వారా తొలగించారు వైద్యులు. అసోంలో జరిగిందీ ఘటన.

By

Published : Jan 22, 2023, 3:56 PM IST

Updated : Jan 22, 2023, 4:26 PM IST

foetus-found-in-abdomen-of-11-month-old-boy-in-assam
11 నెలల బాలుడి కడుపులో రెండు కిలోల పిండం

పదకొండు నెలల బాబుకు అరుదైన శస్త్ర చికిత్స చేశారు వైద్యులు. కడుపులో ఉన్న రెండు కిలోల పిండాన్ని విజయవంతంగా తొలగించారు. పుట్టిన కొన్ని రోజులకే అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న చిన్నారిని పరీక్షించిన వైద్యులు.. శనివారం ఈ ఆపరేషన్​ నిర్వహించారు. అసోంలోని దిబ్రూగఢ్​ జిల్లాలోని అపేక్ష ఆసుపత్రి వైద్యులు ఈ శస్త్ర చికిత్స చేశారు.

అరుణాచల్​ ప్రదేశ్​లోని​ చాంగ్లాంగ్ జిల్లాకు చెందిన బాలుడికి ఈ అరుదైన శస్త్ర చికిత్సను చేశారు వెద్యులు. గత కొన్ని రోజులుగా చిన్నారి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో బాలుడి కుటుంబ సభ్యులు అతడిని చికిత్స కోసం అపేక్ష ఆసుపత్రికి తీసుకువచ్చారు. బాలుడికి అన్ని పరీక్షలు చేసిన వైద్యులు.. కడుపులో పిండం ఉండడాన్ని గుర్తించారు. అనంతరం ఆపరేషన్​ చేసి తొలగించారు.

"బాలుడికి విజయవంతంగా చికిత్స చేశాం. ప్రస్తుతం అతడు పూర్తి ఆరోగ్యంతో ఉన్నాడు. చిన్న పిల్లల కడుపులో పిండం ఉండటాన్ని వైద్య పరిభాషలో ఫెటస్-ఇన్-ఫీటూ అంటారు. ఇలాంటి సందర్భాలు చాలా అరుదు." అని చిన్నారికి చికిత్స చేసిన వైద్యుల్లో ఒకరు తెలిపారు. చిన్నారి చికిత్స విజయవంతం కావడంపై కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. శస్త్రచికిత్స నిర్వహించిన వైద్యులకు వారంతా ధన్యవాదాలు తెలిపారు.

21 రోజుల చిన్నారి కడుపులో ఎనిమిది పిండాలు:
2022 నవంబర్​లో కూడా 21 రోజుల చిన్నారి కడుపులో నుంచి ఎనిమిది పిండాలను తొలగించారు ఝార్ఖండ్​లోని ఓ ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు. ఈ ఆపరేషన్​కు గంటన్నర సమయం పట్టింది. పీడియాట్రిక్ సర్జన్ డాక్టర్ మహమ్మద్ ఇమ్రాన్ నేతృత్వంలోని వైద్యుల బృందం ఈ ఆపరేషన్​ను విజయంవంతంగా పూర్తి చేసింది. పూర్తి కథనం కోసం ఈ లింక్​పై క్లిక్​ చేయండి.

ఎందుకిలా? దీని గురించి వైద్యులు ఏమంటున్నారు:
"ఈ శస్త్రచికిత్స చాలా సంక్లిష్టమైనది. అప్రమత్తంగా లేకపోతే కిడ్నీల నుంచి రక్తశ్రావం జరిగే అవకాశం ఉంటుంది. ఇలాంటి కేసులు చాలా అరుదు. 10 లక్షల మందిలో ఒకరిలో మాత్రమే ఇలా జరుగుతుంది. 'ఫీటస్​ ఇన్​ ఫీటు'గా పిలిచే ఈ సమస్య.. గర్భాశయంలో కవలలు వృద్ధి చెందుతున్న దశలో ఏర్పడే వైకల్యం వల్ల కలుగుతుంది. చిన్నారి తల్లి కడుపులో రెండు పిండాలు ఉన్నప్పుడు.. ఓ పిండం పూర్తి స్థాయిలో వృద్ధి చెందదు. అది వృద్ధి చెందిన మరో పిండంలో అలాగే ఉండి చనిపోతుంది. దీంతో ఫీటస్​ ఇన్​ ఫీటు' సమస్య ఏర్పడుతుంది." అని డాక్టర్లు చెబుతున్నారు.

Last Updated : Jan 22, 2023, 4:26 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details