ముంబయి నుంచి దుబాయ్‌కి విమానంలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. 360 సీట్లున్న బోయింగ్- 777 విమానంలో అతనొక్కడే ప్రయాణించడమే ఇందుకు కారణం.
స్టార్ జమ్ సంస్థకు సీఈఓగా పనిచేస్తున్నారు భవేశ్ జవేరీ. కంపెనీ కార్యాలయం దుబాయ్‌లో ఉన్నందున తరచుగా అక్కడికి వెళ్తుంటారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో విమాన ప్రయాణాలపై ఆంక్షలు విధించింది యూఏఈ. దీంతో ఆ దేశానికి వెళ్లే భారతీయుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఎవరూ లేనందున మే 19న దుబాయ్‌కి వెళ్లే విమానంలో అతనొక్కడే వెళ్లాడు. మరిచిపోలేని ప్రయాణమని అంటున్నాడు భవేశ్.