నీటిలో తేలే 'వండర్ హౌస్'- వరదలు వచ్చినా బేఫికర్! కేరళలో ఓ 'వండర్ హౌస్' ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. వరదలొచ్చినా తట్టుకుని నీటిలో తేలియాడటమే ఈ ఇంటి ప్రత్యేకత. కొట్టాయంకు చెందిన గోపాల కృష్ణన్ ఆచారి దీన్ని నిర్మించారు. తరచూ వరదలొచ్చే తమ ప్రాంతంలో ఎలాంటి నిర్మాణం చేపట్టాలా అని ఆలోచించి ఈ అరుదైన ఇంటికి రూపకల్పన చేశారు. రెండేళ్ల క్రితమే నిర్మాణం పూర్తి చేశారు.
వరదలొచ్చినా తట్టుకుని నీటిలో తేలే 'వండర్ హౌస్' వరదలు వచ్చినప్పుడు మునగకుండా 10 అడుగుల నీటిలోనూ తేలియాడగల ప్రత్యేకత ఈ ఇంటి సొంతం. కారు పోర్చ్, సెప్టిక్ ట్యాంక్ కూడా ఇంటితో పాటు నీటిపై తేలుతాయి. ఇంట్లో ఉన్న మనుషులు, ఇంటి బయట ఉన్న వస్తువులు కూడా వరద కారణంగా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా హాయిగా ఉండొచ్చు.
వరదలొచ్చినా తట్టుకుని నీటిలో తేలే 'వండర్ హౌస్' 2018లో కేరళలో వరదలు బీభత్సం సృష్టించిన అనంతరం ఇలాంటి ఇల్లు నిర్మించాలని గోపాలకృష్ణన్ ఆచారి భావించారు. అప్పటికే ఈ కాన్సెప్ట్‌పై ఆయన ప్రణాళికలు రూపొందిస్తుండగా.. భయానక వరదలు చూసి ప్రాజెక్టు అత్యవసరంగా పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు. తన డ్రీమ్ ప్రాజెక్ట్‌కు ఆర్థిక సాయం కోసం చాలా మందిని సంప్రదించారు. కానీ ఎవరూ ముందుకు రాకపోవడం వల్ల ఆయనే పెట్టుబడి పెట్టారు. చంగనసేరి వాళపల్లిలో 1200 చదరపు అడుగుల విస్తీర్ణంలో అద్భుతంగా ఇంటిని నిర్మించారు.
సిమెంటు, ఇటుకలు లేకుండా..
ఈ ఇంటిని సిమెంటు, ఇటుకలు, కాంక్రీటు లేకుండానే నిర్మించారు ఆచారి. కానీ సాధారణ ఇంటిలానే అన్ని సదుపాయాలు ఉన్నాయి. ఓ ట్యాంకుకు నాలుగు మూలల్లో అమర్చిన నాలుగు పిస్టన్లపై(ఇనుపు కడ్డీలు) ఇంటి నిర్మాణం పూర్తి చేశారు. దీని అడుగున గాలితో నిండిన ప్లాస్టిక్ డ్రమ్ములు ఉంటాయి. కేవలం జీఐ పైపులు, కలపనే గోడల కోసం ఉపయోగించారు. ఇంటి పైకప్పు కోసం చిన్న చిన్న షీట్లను ఉపయోగించారు. సిమెంట్ కాకుండా ప్రత్యేక గమ్‌తో ఫ్లోర్‌కు టైల్స్ వేశారు. ఈ ఇంట్లో పెద్ద హాల్, రెండు బెడ్రూంలు, కిచెన్, అటాచ్డ్ బాత్రూం ఉన్నాయి. దీనిపై మరో అంతస్తు కూడా నిర్మించుకోవచ్చు.
ఇంటి అడుగున్న ప్లాస్టిక్ డ్రమ్ములు కేరళ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ఇంకా గుర్తించి ప్రోత్సాహం అందించాల్సి ఉందన్నారు ఆచారి. తరచూ వరదల వచ్చే ప్రాంతాల్లో ఇలాంటి ఇళ్లు నిర్మిస్తే ప్రజలకు ఉపశమనం కల్గుతుందని అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం సహకారం అందిస్తే చాలా తక్కువ ఖర్చుతోనే వీటిని పూర్తి చేయవచ్చంటున్నారు. కేరళ పునర్నిర్మాణంలో దీన్ని కూడా ప్రభుత్వం చేర్చాలని కోరుతున్నారు.
ఈ ఇంటిని ఎలా నిర్మించారు? ఏ సాంకేతికత ఉపయోగించారు? అనే విషయాలు తెలుసుకునేందుకు కేరళలోని చాలా ప్రాంతాల నుంచి ప్రజలు ఆచారిని సంప్రదిస్తున్నారు. ఇంజినీరింగ్ విద్యార్థులు కూడా ఈ ప్రాజెక్టు గురించి తెలుసుకునేందుకు క్యూ కడుతున్నారు.
వరదలొచ్చినా తట్టుకుని నీటిలో తేలే 'వండర్ హౌస్' ఇదీ చూడండి:'ధరల మంట'పై కాంగ్రెస్ దేశవ్యాప్త ఆందోళనలు