తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చిరుతను చంపి తిన్న స్నేహితులు - ఇడుక్కి

కేరళలోని ఇడుక్కి జిల్లాలో కొందరు వ్యక్తులు చిరుతను చంపి దాని మాంసాన్ని వండుకుని తిన్నారు. చిరుత దంతాలు, గోళ్లు అమ్మకానికి పెట్టడం వల్ల ఘటన వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న అటవీ అధికారులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

Five people have been arrested for hunting and cooking leopard in Idukki
50కేజీల చిరుతను చంపి ఆరగించిన స్నేహితులు

By

Published : Jan 23, 2021, 1:19 PM IST

Updated : Jan 23, 2021, 3:42 PM IST

చిరుతను చంపి ఆరగించిన చర్మం, గోళ్లు, పళ్లను అమ్మకానికి పెట్టిన నిందితులు..

కేరళలోని ఇడుక్కి జిల్లాలో చిరుతను వేటాడి.. వండుకుని తిన్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితులు చిరుత చర్మం, గోర్లు అమ్మకానికి పెట్టగా పోలీసులు వారిని అరెస్టు చేశారు. ఇడుక్కి శివారు గ్రామానికి చెందిన వినోద్​ తన పొలంలోకి అటవీ జంతువులు రాకుండా ఉచ్చులు ఏర్పాటు చేశాడని పోలీసులు భావించారు. అయితే ఉద్దేశపూర్వకంగానే తన పొలంలో ఉచ్చులు ఏర్పాటు చేస్తున్నాడని వెల్లడించారు. ఇంతకముందు కూడా అనేక జంతువులను చంపినట్టు గుర్తించారు.

50కేజీలు..

ప్రస్తుత ఘటనలో సుమారు 50కేజీల బరువున్న చిరుత చిక్కగా.. వినోద్​ అతని స్నేహితులు కలసి దాన్ని వండుకొని తిన్నారని తెలిసి పోలీసులు ఆశ్చర్యపోయారు. అనంతరం నిందితులు చిరుత చర్మం, పళ్లు, గోర్లను అమ్మకానికి పెట్టారు. విషయం తెలుసుకున్న అటవీ అధికారులు.. వాటిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో ప్రవేశపెట్టనున్నట్టు.. మంకుళం అటవీ అధికారి ఉదయసూర్యన్​ తెలపారు.

ఇదీ చదవండి:ఈ ఎద్దుకు మామూలు అభిమానులు లేరుగా..

Last Updated : Jan 23, 2021, 3:42 PM IST

ABOUT THE AUTHOR

...view details