కర్ణాటకలోని చామరాజనగర్లో సిద్ధరామేశ్వర ఆలయంలోని శివలింగానికి.. నంజన్గఢ్ తాలూకా ఆనమ్బల్లి గ్రామ సమీపంలోని కపిల నది నీటితో అభిషేకం నిర్వహించడం సంప్రదాయం. ఈ జలం కోసం ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 35 కిలోమీటర్ల దూరం నడిచి వెళతారు ఈ భక్తులు. అభిషేకించిన ఆ నీటిని గ్రామంలోని ఇళ్లల్లో తీర్థ ప్రసాదంగానూ పంచుతామని గ్రామస్థులు తెలిపారు. ప్రతి ఏడాది శివరాత్రిని పురస్కరించుకొని ఇలా చేయడం ఆచారంగా వస్తోందని వెల్లడించారు.
''ఈ ఆచారం తరతరాలుగా వస్తోంది. మేమూ పాటిస్తున్నాం. సిద్ధరామేశ్వర శివలింగానికి పూజలు చేసేందుకు కపిల నది నుంచి నీటిని తీసుకొస్తాం. దీనికోసం చెప్పులు లేకుండా నడుస్తూ వెళ్లడం మా ఆచారం.''