తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పర్యటక బస్సు- ట్రక్కు ఢీ- ఐదుగురు మృతి - ఐదుగురు మృతి

పర్యటకులు ప్రయాణిస్తున్న బస్సు ఓ భారీ ట్రక్కును ఢీకొట్టిన ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 12 మంది గాయపడ్డారు. రాజస్థాన్​లోని బాప్​ ప్రాంత పరిధిలో ఈ ప్రమాదం జరిగింది.

5 died in a road accident in jodhpur
పర్యటక బస్సు- ట్రక్కు ఢీ- ఐదుగురు మృతి

By

Published : Mar 13, 2021, 10:35 AM IST

రాజస్థాన్​ జోధ్​పుర్​ జిల్లా బాప్​ ప్రాంత పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ పర్యటక బస్సు.. భారీ ట్రక్కును ఢీకొట్టింది. శనివారం ఉదయం జరిగిన ఈ ఘటనలో ఐదుగురు మరణించారు. ఇందులో ఇద్దరు మహిళలు ఉన్నారు. మరో 12 మంది క్షతగాత్రులయ్యారు. బాధితులను సమీప ఆస్పత్రికి తరలించారు.

ఘటనా స్థలంలో గుమికూడిన ప్రజలు

జైసల్మేర్​కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సులో మొత్తం 17 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరంతా దిల్లీకి చెందినవారిగా తెలిపిన పోలీసులు.. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

ప్రమాద దృశ్యాలు

ఇదీ చూడండి: టీకా కోసం భారత్​లో 'క్వాడ్' పెట్టుబడులు!

ABOUT THE AUTHOR

...view details