జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తొలిసారి దేశంలో లిథియం నిల్వలు కనుగొంది. కేంద్రపాలిత ప్రాంతం జమ్ముకశ్మీర్.. రియాసి జిల్లాలోని సలాల్ హైమాన ప్రాంతంలో 59 లక్షల టన్నుల లిథియం రిజర్వ్‌లు ఉన్నట్లు కేంద్ర గనుల శాఖ ప్రకటించింది.
దేశ వ్యాప్తంగా గనుల శాఖ మొత్తం 51 ఖనిజ క్షేత్రాలను గుర్తించింది. వాటిని గనుల శాఖ రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించింది. వీటిల్లో మొత్తం 5 క్షేత్రాల్లో బంగారం నిల్వలను కనుగొన్నారు. మిగిలిన చోట్ల పొటాష్, మాలిబ్డినం, ఇతర ప్రాథమిక లోహాలను గుర్తించారు. జమ్ముకశ్మీర్, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, ఝార్ఖండ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ ప్రాంతాల్లో ఇవి ఉన్నాయి. 2018-19 మధ్య నిర్వహించిన సర్వేల ఆధారంగా గుర్తించారు. వీటిల్లో 17 చోట్ల 7,897 మిలియన్ టన్నుల బొగ్గు, లిగ్నైట్ ఉన్న గనులను కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖకు అప్పగించింది.
భారత్‌కు జాక్‌పాట్.. అక్కడ భారీగా లిథియం నిల్వలు.. బ్యాటరీలు ఇక చౌక! - భారత్‌లో లిథియమ్ నిల్వల తాజా వార్తలు
దేశంలో తొలిసారి లిథియం నిల్వలు కనుగొన్నట్లు కేంద్ర గనుల శాఖ ప్రకటించింది. జమ్ముకశ్మీర్‌లో 59 లక్షల టన్నుల లిథియం రిజర్వులు ఉన్నట్లు పేర్కొంది. దీంతో విద్యుత్ వాహనరంగానికి మరింత బలం చేకూరింది. భవిష్యత్‌లో విద్యుత్ వాహన బ్యాటరీల ధరలు మరింత తగ్గనున్నాయి.
ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీల తయారీలో లిథియం నుంచి వినియోగిస్తారు. ప్రభుత్వం గత కొన్నేళ్లుగా దేశీయంగా విద్యుత్తు వాహనాల తయారీని ప్రోత్సహిస్తోంది. ఈవీల ధరలు తక్కువగా ఉండటానికి పలు పన్ను ప్రోత్సాహకాలను కూడా ప్రకటించింది. ప్రస్తుతం భారత్ లిథియం, నికెల్, కోబాల్ట్ వంటి లోహాలను దిగుమతి చేసుకుంటోంది. జమ్ముకశ్మీర్‌లో లిథియం నిల్వలు కనుగొనడం వల్ల భవిష్యత్తులో విద్యుత్తు వాహన తయారీ రంగానికి మరింత బలం చేకూరనుంది. భవిష్యత్తులో ఈ ఖనిజాల దిగుమతులు తగ్గి బ్యాటరీ ధరలు దిగిరానున్నాయి.
లిథియం కేవలం విద్యుత్తు వాహనాలకే కాదు.. స్మార్ట్‌ఫోన్ల తయారీలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ప్రస్తుతం దేశీయంగా స్మార్ట్‌ఫోన్ల తయారీపై భారత్ దృష్టిపెట్టింది. అత్యాధునిక స్మార్ట్ ఫోన్లలో లిథియం అయాన్ బ్యాటరీలనే వినియోగిస్తున్నారు. లిథియం ధరలు తగ్గేకొద్దీ భారత్‌లో మరింత చౌకగా ఫోన్లు తయారవుతాయి. దేశంలో వ్యూహాత్మక, కీలక ఖనిజాల అన్వేషణ కోసం జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా 115 ప్రాజెక్టులు చేపట్టింది. దేశ వ్యాప్తంగా మొత్తం 51 ఖనిజ క్షేత్రాలను గుర్తించారు. వాటిని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు గనుల శాఖ అప్పగించింది. వీటిల్లో మొత్తం 5 క్షేత్రాల్లో బంగారం నిల్వలను కనుగొన్నారు.