తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఉగాది వేళ వారందరికీ షాక్.. 40 కొత్త ఎన్​ఫీల్డ్​ బైక్స్​ దగ్ధం - bike showroom fire accident

ఉగాది రోజు కొత్త బైక్​ ఇంటికి తెచ్చుకుందామని అనుకున్న వారికి తీవ్ర నిరాశ మిగిలింది. షోరూంలో భారీ అగ్నిప్రమాదం జరిగి 40కిపైగా కొత్త రాయల్ ఎన్​ఫీల్డ్ బైక్​లు బూడిదయ్యాయి.

Fire in bullet showroom
ఉగాది వేళ వారందరికీ షాక్.. 40 కొత్త ఎన్​ఫీల్డ్​ బైక్స్​ దగ్ధం

By

Published : Apr 2, 2022, 10:57 AM IST

కర్ణాటక గడగ్​లో జరిగిన ఘోర అగ్నిప్రమాదం భారీ ఆస్తి నష్టాన్ని, అనేక కుటుంబాలకు తీవ్ర నిరాశను మిగిల్చింది. గడగ్​-హుబ్బళ్లి రోడ్​లోని ద్విచక్రవాహనాల షోరూంలోని 40కిపైగా కొత్త రాయల్​ ఎన్​ఫీల్డ్​ బైక్​లు పూర్తిగా కాలిపోయాయి. ఉగాది రోజున కొత్త బైక్​ ఇంటికి తీసుకెళ్దామన్న ఆశతో దాదాపు 30 మంది కొత్త బైక్​లు ఆర్డర్ చేశారు. వారందరికీ డెలివరీ ఇచ్చేందుకు వీలుగా స్టాక్​ తెప్పించారు షోరూం యజమాని వీరేశ్​ గుగ్గరి. కొద్దిగంటలైతే అంతా సవ్యంగా సాగేది. 30 కుటుంబాలు కొత్త బైక్​ కొన్న సంతోషంతో పండుగను ఘనంగా జరుపుకునేవి.

ఉగాది వేళ వారందరికీ షాక్.. 40 కొత్త ఎన్​ఫీల్డ్​ బైక్స్​ దగ్ధం

అయితే శుక్రవారం అర్ధరాత్రి సమయంలో బైక్​ షోరూంలో మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే వ్యాపించాయి. ఫలితంగా 40కిపైగా రాయల్​ ఎన్​ఫీల్డ్​ బైక్​లు దగ్ధమయ్యాయి. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. రెండు ఫైరింజిన్లతో రెండు గంటలు కష్టపడి మంటలు ఆర్పారు. కానీ అప్పటికే భారీ నష్టం జరిగిపోయింది.

ABOUT THE AUTHOR

...view details