Caged leopard burnt alive: బోనులో పట్టుబడ్డ చిరుతను సజీవదహనం చేశారు కొందరు ప్రజలు. అటవీశాఖ అధికారుల వారిస్తున్నా వినకుండా వారి ముందే ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ అమానవీయ ఘటన ఉత్తరాఖండ్‌లోని పౌరీ జిల్లా సప్లోరీ గ్రామంలో జరిగింది. మంగళవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి 150 మందిపై అధికారులు కేసులు నమోదు చేశారు.
ఇదీ జరిగింది..: ఈనెల 15న అడవిలోకి వెళ్లిన సప్లోడీ గ్రామానికి చెందిన ఓ మహిళపై చిరుత దాడి చేసింది. ఈ క్రమంలో ఆమె ప్రాణాలు కోల్పోయింది. దీంతో అప్రమత్తమైన అధికారులు.. చిరుతను పట్టుకునేందుకు బోను ఏర్పాటు చేశారు. ఈనెల 24న చిరుత ఆ బోనులో చిక్కింది. ఈ విషయం తెలుసుకున్న అధికారులు చిరుతను నాగదేవ్ రేంజ్ ఆఫీసుకు తరలిస్తుండగా.. సప్లోడీ సహా సార్నా, కుల్మోరీకు చెందిన 150 మంది వారిని అడ్డుకున్నారు. చిరుత దాడిలో తన మహిశ మృతిచెందడం పట్ల ఆగ్రహంగా ఉన్న గ్రామస్థులు చిరుత ఉన్న బోనుపై పెట్రోల్ పోసి నిప్పటించారు. ఈ క్రమంలో ఆ చిరుత కాలిపోయి ప్రాణాలు విడిచింది.