బంగాల్ ప్రతిపక్షనేత సువేందు అధికారిపై కేసు నమోదు చేశారు పోలీసులు. కంతి మున్సిపాలిటీ కార్యాలయం నుంచి సామగ్రి దొంగతనం చేశారన్న ఆరోపణల మధ్య సువేందు అధికారి, అతని సోదరుడు కాంతిపైనా కేసు నమోదైంది.
కంతి మున్సిపల్ బోర్డు సభ్యుడు రత్నదీప్ మన్నా.. సువేందు అధికారి, ఆయన సోదరుడిపై కంతి పోలీస్ స్టేషన్లో జూన్ 1 న ఫిర్యాదు చేశారు.
" మే 29న సువేందు అధికారి, కాంతి, మాజీ కంతి మున్సిపాలిటీ చీఫ్ సౌమేందు అధికారి.. కార్యాలయ గిడ్డంగిలో బలవంతంగా, అక్రమంగా చొరబడి లక్షలు విలువచేసే సామాగ్రిని దోచుకెళ్లారు."