సమాజంలోని అన్ని వర్గాలకు సాయం చేయడానికే ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా కేంద్రం మరో ఆర్థిక ప్యాకేజీ ప్రకటించిందని.. ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఉద్యోగాల సృష్టి, దెబ్బతిన్న రంగాలకు ఊతం, తయారీని పెంచటం, స్థిరాస్తి రంగానికి ప్రోత్సాహం సహా రైతులకు మద్దతు ఇచ్చేందుకు ఈ ప్యాకేజీ ఎంతగానే సాయం చేస్తుందని ట్విట్టర్లో మోదీ పేర్కొన్నారు.
దేశం స్వయం సమృద్ధి సాధించడానికి ఉపకరించే ఏ ఒక్క ప్రయత్నాన్నీ ప్రభుత్వం విడనాడడం లేదని భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా ట్వీట్ చేశారు.