బంగాల్‌లో చివరిదైన ఎనిమిదో దశ పోలింగ్ పూర్తయింది. తుదిదశలో 35 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ పూర్తయ్యింది. పలుచోట్ల ఉద్రిక్తతలు చెలరేగాయి. సాయంత్రం 6.30గంటల వరకు అక్కడ 76.07శాతం పోలింగ్ నమోదైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. రాష్ట్రంలో కొవిడ్ తీవ్రత ఉన్నప్పటికీ తన ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు భారీ సంఖ్యలో పోలింగ్ బూత్‌లకు తరలివచ్చారు. దీంతో అన్ని దశల్లోనూ బంగాల్‌లో భారీ పోలింగ్ నమోదయ్యింది.
బంగాల్‌లో 294 అసెంబ్లీ స్థానాలు ఉండగా మొత్తం ఎనిమిది దశల్లో అక్కడ ఎన్నికలు జరిగాయి. మార్చి 27న మొదలైన ఎన్నికల ప్రక్రియ నేటితో ముగిసింది. మే 2వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది.