father set his fire on son idukki: కన్న కొడుకు , అతని కుటుంబ సభ్యులపై పెట్రోల్ పోసి తగలబెట్టాడు ఓ తండ్రి. ఈ ఘటన కేరళలోని తొడుపుజా సమీపంలో గల చినికుజి గ్రామంలో జరిగింది. ఈ ఘటనలో ఫైజల్ , అతని భార్య, ఇద్దరు పిల్లలు మెహ్రా(16), అస్నా(13) ప్రాణాలు కోల్పోయారు.
ఆస్తి తగాదాలే కారణం..
తొడుపుజాకు చెందిన ఫైజల్ కిరాణా దుకాణం నిర్వహిస్తున్నాడు. ఈయన తండ్రి హమీద్.. 50సెంట్ల భూమిని ఫైజల్‌కు ఇచ్చాడు. అనంతరం వీరిద్దరి మధ్య విభేదాలు ఏర్పడి విడివిడిగా ఉంటున్నారు. 2018లో హమీద్.. తన కుమారుడు ఫైజల్‌కి ఇచ్చిన భూమిని తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశాడు . ఫైజల్ తన భూమిని తిరిగి తండ్రికి ఇవ్వడానికి ఇష్టపడలేదు. దీంతో కోపం పెంచుకున్న హమీద్.. ఫైజల్ కుటుంబాన్ని హతమార్చాడు.
నిందితుడు హమీద్ పక్కా ప్రణాళిక ప్రకారం హత్యకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. హమీద్ ఇంట్లో ముందుగానే పెట్రోల్ కొనుక్కొని ఉంచుకున్నాడు. మంటలను ఆర్పేందుకు వీలులేకుండా ఫైజల్ ఇంట్లోని వాటర్ ట్యాంక్‌ను ఖాళీ చేశాడు. ఫైజల్ కుటుంబం నిద్రలో ఉండగా శనివారం రాత్రి ఒంటి గంటకు పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. వీరి హత్య అనంతరం నిందితుడు హమీద్.. దగ్గర్లోని బంధువుల ఇంటికి వెళ్లిపోయాడు. అక్కడే నిందితుడు హమీద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చదవండి:కాలేజ్‌లో ప్రేమ.. ఉద్యోగంలో సహజీవనం.. పెళ్లి అనేసరికి కులం.. పెట్రోల్ పోసి..