Father Raped Daughter: రక్తం పంచుకుపుట్టిన కుమార్తె పట్ల రాక్షసుడిలా మారాడా తండ్రి. వావివరసలు మరచి అత్యాచారం చేశాడు. తండ్రీకూతుళ్ల బంధానికే మచ్చతెచ్చే ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని సహారన్‌పుర్‌లో జరిగింది. బాధితురాలి ఫిర్యాదుతో.. నిందితుడిని అరెస్టు చేశారు పోలీసులు.
ఇదీ జరిగింది:తన తండ్రి అత్యాచారం చేశాడని ఓ బాలిక ఏప్రిల్ 9న సదర్ బజార్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించింది. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పోక్సో చట్టం సహా వివిధ సెక్షన కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కొన్ని రోజులు గాలింపు చేపట్టి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం.. కోర్టులో ప్రవేశపెట్టి జైలుకు తీసుకెళ్లారు.