Father Raped His Minor Daughter: హరియాణా గురుగ్రామ్‌లో అమానవీయ ఘటన వెలుగు చూసింది. సొంత బిడ్డ పైనే అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కిరాతక తండ్రి. ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది.
ఆదివారం రాత్రి నిద్రిస్తున్న సమయంలో తన పన్నెండేళ్ల కూతురుపై తన భర్త అత్యాచారానికి పాల్పడ్డాడని బాలిక తల్లి పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. బాలికను ఆసుపత్రిలో చేర్పించారు. పరారీలో ఉన్న నిందితుని కోసం గాలింపు చేపట్టారు.