దిల్లీ-హరియాణా సరిహద్దు ప్రాంతం సింఘులో ఒక్కరోజు నిరాహార దీక్షకు దిగారు రైతులు. 19వరోజూ సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగిస్తున్నారు.
సాగు చట్టాల రద్దే ఏకైక డిమాండ్‌గా రైతు సంఘాల నిరాహార దీక్ష చేపట్టారు. దిల్లీ సరిహద్దుల్లోని నిరసన ప్రాంతాల్లోనే దీక్షకు కూర్చున్నారు. సింఘు, టిక్రీ, ఘాజిపూర్ సహా నిరసన ప్రాంతాల్లోనే సాయంత్రం 5 గంటల వరకు ఈ దీక్ష కొనసాగనుంది. కేంద్రం దిగివచ్చేవరకు ఆందోళన విరమించేది లేదని రైతులు తేల్చి చెబుతున్నారు. కొత్త సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఆందోళనలు ఉద్ధృతం చేసేందుకు దిల్లీ సరిహద్దులకు మరికొంతమంది రైతులు చేరుకుంటున్నారు.
రైతుల ఆందోళనకు మద్దతుగా దిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా ఈరోజు ఉపవాసం ఉండనున్నారు.