తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'సాగు చట్టాల ప్రతులు హోలీ మంటల్లో దహనం చేస్తాం'

సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనను మరింత తీవ్రతరం చేయనున్నట్లు రైతు సంఘాలు ప్రకటించాయి. ఉద్యమం నాలుగు నెలలు పూర్తి చేసుకోనున్న నేపథ్యంలో మార్చి 26న తలపెట్టిన 'సంపూర్ణ భారత్ బంద్'ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చాయి. ఈ మేరకు దిల్లీలో బుధవారం సమావేశమైన రైతు నేతలు.. నూతన సాగు చట్టాల ప్రతులను హోలీ మంటల్లో దహనం చేయనున్నట్లు ప్రకటించారు.

Farmers to intensify agitation with Bharat bandh, burning farm laws on Holi
'సాగు ప్రతులను హోలీ మంటల్లో దహనం చేస్తాం'

By

Published : Mar 17, 2021, 8:39 PM IST

సాగు చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన రైతుల నిరసనలు నాలుగు నెలలకు చేరుతున్న సందర్భంగా మార్చి 28న హోలీ మంటల్లో వ్యవసాయ చట్టాల ప్రతులను దహనం(హోలీ కా దహన్) చేయాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. మార్చి 26న ప్రకటించిన 'భారత్ బంద్​'తో ఆందోళనను తీవ్రతరం చేయనున్నట్లు తెలిపాయి. బంద్​ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చాయి.

హోలీ సందర్భంగా మూడు సాగు చట్టాల ప్రతులను దహనం చేయాలని నిర్ణయించాం. దీంతో కేంద్రం వైఖరిలో మార్పు వస్తుందని ఆశిస్తున్నాం. చట్టాలను రద్దు చేసి, మద్దతు ధరకు లిఖిత పూర్వక హామీని ఇస్తుందని భావిస్తున్నాం.

-రంజిత్ రాజు, కిసాన్ సమితి నేత

ఈ బంద్​కి దేశవ్యాప్తంగా కార్మిక, రవాణా సంఘాలతో పాటు విద్యార్థి, యువత, మహిళా విభాగాలు మద్దతు ప్రకటించాయి. 12 గంటలపాటు దుకాణాలు, ఇతర వ్యాపార సంస్థలను మూసేయాలని నిర్ణయించాయి.

112 రోజుల పాటు ఈ ఉద్యమం కొనసాగింది. ఇదీ ఒక విజయమే. ప్రజల నుంచి ఊహించని మద్దతు లభించింది. ఈ ఉద్యమం మరింత బలపడుతుంది. రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయిలో ఈ బంద్​ విజయవంతంగా కొనసాగుతుంది.

-కృష్ణ ప్రసాద్, ఏఐకేఎస్ నాయకుడు.

ఇదీ చదవండి:బెదురులేని అన్నదాత- ఉద్యమం మరింత ఉద్ధృతం

ABOUT THE AUTHOR

...view details