తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'భాజపాను ఓడించమని ప్రజల్ని కోరుతాం'

అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో పలు కార్యక్రమాలు నిర్వహించి భాజపాను ఓడించమని రైతులను కోరనున్నట్లు సంయుక్త కిసాన్​ మోర్చా ప్రకటించింది. మార్చి 5 నుంచి 15 వరకు తమ తదుపరి కార్యచరణ ఏమిటో స్పష్టం చేసింది.

farmers to bloc KMP Expressway for five hours from 11 am on March 6
'భాజపాను ఓడించమని ప్రజల్ని కోరుతాం'

By

Published : Mar 2, 2021, 7:11 PM IST

Updated : Mar 2, 2021, 7:54 PM IST

అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో పర్యటించి భాజపాను ఓడించమని ప్రజల్ని కోరుతామని సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటించింది. సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఉద్యమం చేపట్టి 100 రోజులు కావొస్తున్న నేపథ్యంలో.. మార్చి 6న కుండ్లీ-మనేసర్-పల్వాల్​ ఎక్స్​ప్రెస్​వేను దిగ్బంధించనున్నట్లు స్వరాజ్​ ఇండియా నేత యోగేంద్ర యాదవ్ స్పష్టం చేశారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు వివిధ ప్రాంతాల్లో రైళ్లను నిలిపివేయనున్నట్లు పేర్కొన్నారు.

ఈ మేరకు మార్చి 12న రైతు నేతలు బంగాల్​లో ఓ కార్యక్రమం నిర్వహించనున్నారు. సంయుక్త కిసాన్​ మోర్చా నేత బల్బీర్ సింగ్ రాజేవల్.. పశ్చిమ్​ బంగా, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో పర్యటించనున్నారు.

" ఏ పార్టీ కోసం ఓట్లు అడగం. రైతుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైన భాజపాను ఓడించమని కోరుతాం."

-బల్బీర్ సింగ్. రైతు నేత.

మార్చి 8న 'మహిళ దినోత్సవం' సందర్భంగా మరో ర్యాలీని నిర్వహించనున్నట్లు.. ఆ ర్యాలీకి మహిళలే ప్రాతినిధ్యం వహించనున్నట్లు యోగేంద్ర యాదవ్ పేర్కొన్నారు.

తదుపరి కార్యాచరణ..

మార్చి 5- కర్ణాటకలో 'ఎమ్​ఎస్​పీ దిలావో' పేరుతో ఉద్యమం

మార్చి 6- కేఎంపీ ఎక్స్​ప్రెస్​ వే దిగ్భందం

మార్చి 8-దిల్లీ సరిహద్దుల్లో మహిళ ప్రాతినిధ్యంలో ర్యాలీ

మార్చి 12- ఎన్నికల జరగనున్న రాష్ట్రాల్లో రైతు నేతల పర్యటన

మార్చి 15-ప్రెవేటీకరణకు వ్యతిరేకంగా..దేశవ్యాప్తంగా కార్మికులు, ఉద్యోగుల భారీ ర్యాలీ. ఇందులో రైతులు కూడా పాల్గొంటారు.

ఇదీ చదవండి:'సైబర్​ దాడి నిజమే- చైనానేనని చెప్పలేం!'

Last Updated : Mar 2, 2021, 7:54 PM IST

ABOUT THE AUTHOR

...view details