రైతుల ఆందోళన షహీన్బాగ్తరహా కాదనన్నారు భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేశ్ టికాయిత్. సాగు చట్టాలను రద్దుచేసే వరకు ఇంటికి తిరిగివెళ్లే ప్రసక్తే లేదని మరోమారు తేల్చిచెప్పారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని గాజియాబాద్‌లో కుండ్లీ-మానేసర్ ఎక్స్‌ప్రెస్ వేను 24 గంటలపాటు దిగ్బంధించిన సందర్భంగా ఈటీవీ భారత్‌తో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇంటికి వెళ్లేది లేదు..
"రాజస్థాన్‌లో నాపై దాడి చేయించింది భాజపానే. రైతుల ఉద్యమాన్ని షహీన్బాగ్లా నీరుగార్చాలని అనుకుంటున్నారు. కొవిడ్‌ను సాకుగా చూపుతున్నారు. కానీ మా పోరాటం షహీన్‌బాగ్ తరహాలా కాదు. సాగు చట్టాలను రద్దుచేసే వరకు ఇంటికి వెళ్లేది లేదు."--- రాకేశ్ టికాయిత్, బీకేయూ నేత
సీఏఏకు వ్యతిరేకంగా దిల్లీ షహీన్‌బాగ్‌లో తీవ్ర స్థాయిలో ఆందళనలు చెలరేగాయి. కానీ గతేడాది మార్చి చివర్లో.. కరోనా విజృంభణ నేపథ్యంలో ఆ ప్రాంతం ఖాళీ అయిపోయింది.
కొవిడ్ నిబంధనలను పాటించకపోవడంపై..