తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తోమర్​తో హరియాణ రైతుల భేటీ

తదుపరి రైతు చర్చల్లో తమకూ భాగం కల్పించాలంటూ హరియాణకు చెందిన ఓ రైతు సంఘం కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్​కు విజ్ఞప్తి చేసింది. సత్లజ్​ యమునా కాలువ సమస్యను పరిష్కరించాలని కోరింది.

farmers- meet- tomar- over- sutlej -yamuna- canal- issue
తోమర్​తో భేటీ అయిన హరియాణ రైతులు

By

Published : Jan 7, 2021, 10:57 PM IST

జనవరి 8న రైతులతో మరో విడత చర్చలు జరగనున్న సందర్భంగా ఓ రైతు సంఘం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్​తో భేటీ అయింది. హరియాణ యువ కిసాన్ సంగర్ష్ సమితి పేరుతో ఉన్న ఈ సంఘం.. చర్చల్లో పాల్గొనేందుకు తమకు అనుమతి ఇవ్వాలంటూ కోరింది. అయితే తాము అనుమతి కోరింది హరియాణలోని సత్లజ్ యమునా కాలువ సమస్య గురించి చర్చించడానికని రైతు సంఘం తెలిపింది.

మాజీ ఎమ్మెల్యే నరేశ్ యాదవ్ అతేలీ ఆధ్వర్యంలో హరియాణ నుంచి డిసెంబరు 30న బయలుదేరి కాలినడకన దిల్లీ చేరుకున్నారు. వ్యవసాయ చట్టాల రైతుల ఆందోళనలు తీవ్రం అవుతున్న సమయంలో ఈ విజ్ఞప్తి చేయడం గమనార్హం.

ఈ సమస్య ఏనాటిదో...

సాగు చట్టాలపై స్పందిస్తూ.. ఈ చట్టాలు ఇప్పుడు వచ్చాయని, కాలువ సమస్య 45 ఏళ్లుగా ఉందని నరేశ్ యాదవ్ అన్నారు. ఈ సమస్యపై కేంద్ర జలవనరుల శాఖకు విజ్ఞప్తి చేశామని స్పష్టం చేశారు. తోమర్ సానుకూలంగా స్పందించారని చెప్పారు. కాలువ సమస్యపైన పంజాబ్​ హరియాణ నాయకులు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. సాగు చట్టాలు సరికాదన్న నేతలు అందుకు రుజువు చూపించాలని పేర్కొన్నారు.

ఇదీ చదవండి :'దేశాన్ని నడిరోడ్డు మీదకు తెచ్చిన ఘనత మీదే'

ABOUT THE AUTHOR

...view details