తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చర్చలపై బుధవారం రైతు సంఘాల కీలక భేటీ - రైతు దీక్షలు

సాగు చట్టాలపై చర్చించేందుకు రావాలని కేంద్రం రాసిన లేఖపై రైతు సంఘాలు స్పందించాయి. ఈ విషయంపై నిర్ణయం తీసుకునేందుకు బుధవారం అన్ని రైతు సంఘాలు భేటీ కానున్నాయి. ఈ మేరకు రైతు సంఘం నాయకుడు కుల్వంత్​ సింగ్​ సంధు తెలిపారు.

Farmer unions defer decision on Centre's letter for fresh talks
రైతు సంఘాల సమావేశం రేపటికి వాయిదా

By

Published : Dec 22, 2020, 7:44 PM IST

నూతన వ్యవసాయ చట్టాలపై మరో దఫా చర్చలకు రావాలని కేంద్రం రాసిన లేఖపై బుధవారం(డిసెంబర్​23) నిర్ణయం తీసుకుంటామని రైతు నాయకుడు కుల్వంత్​ సింగ్​ సంధు తెలిపారు. తదుపరి కార్యాచరణపై పంజాబ్​కు చెందిన 32 రైతు సంఘాలతో సమావేశం నిర్వహించినట్లు వెల్లడించారు. అయితే కొత్త వ్యవసాయ చట్టాల రద్దే తాము కోరుతున్నట్లు ఆయన మరో మారు స్పష్టం చేశారు.

ప్రధాని రావొద్దు

జనవరి26 గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా రానున్న బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ భారత్‌కు రాకుండా చూడాలని ఆ దేశ ఎంపీలకు లేఖ రాయనున్నట్లు ఆయన తెలిపారు.

ఇదీ చూడండి:ఎగుమతులపై రైతు నిరసనల ప్రభావమెంత?

ABOUT THE AUTHOR

...view details