తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'అప్పటివరకు దిల్లీ సరిహద్దులను వీడబోం'

కేంద్రం తీరుపై భారతీయ కిసాన్ యూనియన్​ జాతీయ ప్రతినిధి రాకేశ్​ టికాయిత్ మండిపడ్డారు. షరతులు లేని చర్చలకు కేంద్రం సిద్ధమవనంతవరకు దిల్లీ సరిహద్దులను రైతులు వీడబోరని మరోమారు స్పష్టం చేశారు.

Behror Rakesh Tikait
రాకేశ్​ టికాయిత్​

By

Published : Jul 25, 2021, 6:27 AM IST

Updated : Jul 25, 2021, 6:53 AM IST

భారతీయ కిసాన్ యూనియన్​ జాతీయ ప్రతినిధి రాకేశ్​ టికాయిత్​ కేంద్రం తీరుపై మండిపడ్డారు. షరతులు లేని చర్చలకు కేంద్రం సిద్ధమవనంతవరకు దిల్లీ సరిహద్దులను రైతులు వీడబోరని స్పష్టం చేశారు. దేశమంతటా రైతులు ఆందోళనకు దిగుతారని అన్నారు. రాజస్థాన్​లోని బెహరోర్​కు వెళ్లిన టికాయిత్​.. ఈ-బైక్​ షోరూం ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.

అధికారంలోకి వచ్చాక స్వామినాథన్​ కమిటీ సిఫారసులను అమలు చేస్తామన్న భాజపా.. వాటిని అమలు చేయట్లేదని ఆరోపించారు టికాయిత్​. కేంద్రంలో ఉన్నది భాజపా ప్రభుత్వం కాదని కంపెనీలు నడిపే మోదీ ప్రభుత్వం అని దుయ్యబట్టారు. తాము ఏ రాజకీయ పార్టీలో చేరబోమని, ప్రజలకు ఆమోదం కాని చట్టాలను తీసుకువచ్చే ప్రభుత్వాలను మాత్రమే వ్యతిరేకిస్తామని చెప్పారు. పార్లమెంట్​లో రైతుల సమస్యలపై ప్రశ్నించని ఎంపీలకు చెందిన ప్రాంతాల్లో ఆందోళనలు చేస్తామని ప్రకటించారు. రైతుల ఆందోళనతో సాధారణ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న ప్రశ్నపై స్పందించిన టికాయిత్​.. తమను దిల్లీలోకి అనుమతిస్తే రోడ్లను వెంటనే ఖాళీ చేస్తామని అన్నారు.

Last Updated : Jul 25, 2021, 6:53 AM IST

ABOUT THE AUTHOR

...view details