తన పెంపుడు శునకాన్ని పేరు పెట్టి పిలవకుండా 'కుక్క' అని పిలిచాడని ఓ వ్యక్తిని హత్యచేశారు ఇద్దరు యువకులు. ఈ ఘటన తమిళనాడులోని దిండిగల్‌లో జరిగింది. మృతుడిని రాయప్పన్(65)గా పోలీసులు గుర్తించారు. మృతుడు రైతు అని పోలీసులు తెలిపారు. శుక్రవారం జరిగిందీ ఘటన.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
దిండిగల్‌కు చెందిన రాయప్పన్.. డేనియల్ ఇరుగుపొరుగువారు. వీరిద్దరికి బంధుత్వం కూడా ఉంది. రాయప్పన్ తన మనవడితో కలిసి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆ సమయంలో డేనియల్ సోదరుడు విన్సెంట్ పెంచుకుంటున్న కుక్క అరుస్తూ రాయప్పన్ వైపు దూసుకొచ్చింది. దీంతో రాయప్పన్ 'గో డాగ్' అని కుక్కను వారించాడు. కుక్కను తరిమికొట్టేందుకు కర్రను తీసుకురావాలని తన మనవడికి చెప్పాడు. దీంతో డేనియల్‌కు, రాయప్పన్‌కు వాగ్వాదం జరిగింది. కోపోద్రిక్తుడైన డేనియల్.. కత్తితో రాయప్పన్ ఛాతీపై పొడిచాడు. ఈ హత్యలో డేనియల్‌కు అతడి సోదరుడు విన్సెంట్ సాయపడ్డాడు. రాయప్పన్ ఘటనాస్థలిలోనే కుప్పకూలి మృతి చెందాడు. నిందితులిద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు.