Family Committed Suicide: బావిలో దూకి కుటుంబం ఆత్మహత్య - వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన కుటుంబం
Published : Sep 12, 2023, 9:07 AM IST
|Updated : Sep 12, 2023, 1:03 PM IST
09:04 September 12
భార్యాభర్తలతోపాటు కుమార్తె మృతి
Family Committed Suicide: విజయనగరం జిల్లా కొత్తవలస మండలం చింతలపాలెంలో విషాదం చోటుచేసుకుంది. వ్యవసాయ బావిలో దూకి ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖ జిల్లా మర్రిపాలెం ఎఫ్‌సీఐ నగర్‌కు చెందిన ఎం.డీ.మొహినుద్దీన్, అతడి భార్య, కుమార్తె.. నిన్న సాయంత్రం చింతలపాలెంలోని తమ స్థలం చూసేందుకు వెళ్లారు. అయితే క్యాబ్‌లో అక్కడికి చేరుకున్న అనంతరం వారు.. కుమారుడు ఆలీకి ఫోన్ చేసి.. తాముు ఆత్మహత్య చేసుకుంటున్నామని తెలిపి లొకేషన్ షేర్ చేసి.. సూసైడ్ నోట్ పెట్టి చనిపోయినట్లు సమాచారం. ఈ ఘటనలో భర్త ఎం.డీ.మొహినుద్దీన్(46), భార్య సంఘనిషా(39), కుమార్తె ఫాతిమా జహీరా(17) మృతి చెందారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కొత్త వలస సీఐ చంద్రశేఖర్ వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.