తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Fake Baba Rapes on New Bride in Hyderabad : హైదరాబాద్​లో వైద్యం పేరుతో నవవధువుపై నకిలీ బాబా అత్యాచారం

By ETV Bharat Telugu Team

Published : Aug 30, 2023, 11:17 AM IST

Updated : Aug 30, 2023, 12:42 PM IST

Fake Baba Rapes
Fake Baba Rapes on New Bride in Hyderabad

10:51 August 30

Fake Baba Rapes on New Bride in Hyderabad : వైద్యం పేరుతో నవవధువుపై నకిలీ బాబా అత్యాచారం

Fake Baba Rapes on New Bride in Hyderabad : హైదరాబాద్ పాతబస్తీలో దారుణం వెలుగు చూసింది. వైద్యం పేరుతో ఓ నవ వధువుపై నకిలీ బాబా అత్యాచారానికి పాల్పడ్డాడు. ట్రీట్‌మెంట్ కోసం వెళ్లిన ఆమెకు కళ్లకు గంతలు కట్టి గదిలో బంధించిఅత్యాచారం చేశాడు. అయితే బాధితురాలు తల్లిదండ్రుల సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేయటంతో నకిలీ బాబా పరారయ్యాడు.

వివరాల్లోకి వెళితే..హుస్సేనీఆలం ప్రాంతానికి చెందిన యువతికి 3 నెలల క్రితం వివాహం జరిగింది. కాగా.. యువతికి ఆరోగ్యం సరిగా లేదని అత్తమామలు బండ్లగూడలో బాబా వద్దకు తీసుకెళ్లారు. దీంతో బాబా నవవధువు కళ్లకు గంతలు కట్టి గదిలో బంధించాడు. అనంతరం.. ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ విషయం కాస్త బయటికి తెలియడంతో నకిలీ బాబా పరారయ్యాడు. తన ఆరోగ్యం బాగోలేదని అత్తమామలకు చెప్పినా పట్టించుకోవట్లేదని యువతి ఆరోపిస్తుంది. వారు ఆమె మాటలు నమ్మకపోగా.. యువతికి దయ్యం పట్టిందని ఇంట్లోనే బంధించారు. చివరకు బాధిత యువతి తల్లిదండ్రుల సాయంతో భవానీనగర్ పోలీస్​ స్టేషన్​లో తనకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేసింది. ఘటన బండ్లగూడ పరిధిలో జరిగిందని, భవానీనగర్ పోలీసులు అక్కడికే రెఫర్ చేశారు. పోలీసులు కూడా న్యాయం చేయకుండా ఇబ్బంది పెడుతున్నారని సదరు బాధితురాలు కన్నీటి పర్యంతమైంది.

Woman Murder in Nanakramguda : నానక్‌రాంగూడలో మహిళపై అత్యాచారం.. ఆపై హత్య! గవర్నర్, మహిళా కమిషన్ స్పందన

Last Updated : Aug 30, 2023, 12:42 PM IST

ABOUT THE AUTHOR

...view details